Bigg Boss 10:బిగ్ బాస్ 10.. 6వ వారం షాలిని, వర్షిణి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఈసారి అందరూ వర్షిణి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా షాలిని ఎలిమినేట్ అయింది. అయితే ఆమెకు మరో అవకాశాన్ని కల్పిస్తూ అభిమానులకు సర్ప్రైజ్ చేస్తూ సీక్రెట్ రూమ్ కి పంపించారు బిగ్ బాస్.
ఇకపోతే మొదట షాలిని ఎలిమినేట్ అని చూపించగానే రోహిత్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. షాలిని వల్లే రోహిత్ ఆట చెడిపోతోందంటూ అటు రోహిత్ అభిమానులే కాదు హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఇదే మాటను బయటకు తీశారు. ముఖ్యంగా రోహిత్ షాలినికి మ్యానుపులేట్ అవుతున్నాడని , ఆమె ఎలా చెబితే అలా ఆడుతున్నాడని, హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆడదామని అడిగినా రోహిత్ ఆడడం లేదు అంటూ ఇదే విషయాలను నామినేషన్ లో తీసుకొచ్చి మరీ నామినేట్ చేస్తున్న రోహిత్ లో మార్పు రాకపోవడం గమనార్హం. దీంతోషాల్ని ఎలిమినేట్ అయిందని చెప్పడంతో రోహిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే సడన్గా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపించడం మరో విశేషం.
ఇదిలా ఉండగా ఇన్ని రోజులు వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని, ఈ లవ్ ట్రాక్ ముదిరి హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటారేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హౌస్ లో ఎప్పుడూ త్రిగుణ్ తో గొడవలు పడుతూ.. కావలసినంత కంటెంట్ ఇచ్చే షాలినినీ ఇప్పుడు సడన్గా త్రిగుణ్ చెల్లి అని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు అన్నా చెల్లి బాండింగ్ నడిచింది. అసలు ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రోహిత్ పై మండిపడుతున్నారు. ఇకపోతే తాజాగా 43వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని విడుదల చేయగా.. నామినేషన్ వార్ మొదలైంది. అందులో భాగంగానే రోహిత్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి
నామినేషన్ లో భాగంగా రోహిత్.. సుధీర్ ని నామినేట్ చేస్తూ “నా ఫ్యామిలీ మీద ఒట్టు.. నేను ఎటువంటి డీల్స్ పెట్టుకోను అని చెప్పాడు అని అంటుండగానే నిజంగానే ఒట్టు వేశాడా అని ప్రశ్నించారు త్రిగుణ్. అవును అని రోహిత్ చెప్పగానే.. త్రిగుణ్ మండిపడుతూ ఒట్టేసావా సుధీర్ అని నేను అడిగానా లేదా అని ప్రశ్నించాడు. త్రిగుణ్ అన్న నువ్వు వెళ్తావా అంటే వెళ్తానన్నాడు.. నమ్మకంతో పంపించాను అని సుధీర్ చెబుతుంటే.. త్రిగుణ్.. అమన్ నీతో ఏదైనా డీల్ చేశానా? అని ప్రశ్నించాడు. నేను వినలేదని అమన్ చెప్పాడు. త్రిగుణ్ మాట్లాడుతూ.. శివ డీల్ చేయడానికి వస్తే.. శివ నీతో డీల్ పెట్టుకోవడానికి నేను రెడీగా లేను.. దయచేసి మాట్లాడొద్దు అని చెప్పాను.
also read:చిరంజీవి కాకా మూవీ నుండి సీన్ లీక్.. ఊరమాస్ గెటప్ లో అదుర్స్!
శివ మాట్లాడుతుండగా మధ్యలో దక్ష మాట్లాడుతూ.. నన్ను నమ్ముంటే ఈ ప్రపంచానికి అడ్డు వేసిఅయినా నేను మిమ్మల్ని సేవ్ చేసేవారని మీరన్నారు అంటూ రోహిత్ తో అన్నది. త్రిగుణ్ మాట్లాడుతూ.. అతడిని గెలిపిస్తే శివ వస్తాడు శివ వస్తే నాకు పవర్ పెరుగుతుందని ప్లాన్ చేసింది నువ్వు అంటూ రోహిత్ పై మండిపడ్డాడు. ఆ తర్వాత త్రిగుణ్ , రోహిత్ మధ్య మాట మాటా పెరిగింది. షాలినికి హెల్ప్ చేయడానికి , డీల్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావు అని త్రిగుణ్ అంటే.. రోహిత్ మాట్లాడుతూ.. నా చెల్లి అనుకొని ఫేక్ రిలేషన్స్ పెట్టుకోకండి.. అంటే .. చెల్లి చెల్లి అని అన్నప్పుడు ఒక అన్నతో ఎలా మాట్లాడాలి అంటూ మండిపడ్డారు త్రిగుణ్. అసలు ఇన్ని రోజులు హౌస్ లో త్రిగుణ్ షాలినితో ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు శివ నామినేషన్ సమయంలో.. రోహిత్ .. త్రిగుణ్ కి చెల్లి అని టాపిక్ డైవర్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇన్ని రోజులు మీ ఇద్దరి లవ్ ట్రాక్ అందరికీ విసుగు తెప్పించింది. ఇప్పుడు శాలిని బయటకెళ్ళి పోయాక, త్రిగుణ్ కి షాలిని చెల్లి అయిపోయిందా అంటూ మండిపడుతున్నారు. మొత్తానికైతే నామినేషన్ వార్ మరింత హీటెక్కింది.