E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!
Advertisement

Pocket Sized Gadgets: ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు.. స్మార్ట్‌ఫోన్‌ను మనం ఒక్క క్షణం కూడా వదలడం లేదు. పాటలు వినాలన్నా, ఫోటోలు తీయాలన్నా, టైమ్ చూడాలన్నా.. ప్రతిదానికీ ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. కానీ, అవసరానికి ఫోన్ చేతిలోకి తీసుకుంటే చాలు.. నోటిఫికేషన్లు, సోషల్ మీడియా మనల్ని మరో ప్రపంచంలోకి లాగేస్తాయి. ఐదు నిమిషాల్లో అయిపోవాల్సిన పని కాస్తా.. గంటల తరబడి ఫోన్‌కే అతుక్కుపోయేలా చేస్తుంది.

మరి, ప్రతిదానికీ స్మార్ట్‌ఫోన్‌నే వాడాల్సిన అవసరం ఉందా? ఫోన్ డిస్ట్రాక్షన్స్ లేకుండా, మనకు కావాల్సిన పనిని మాత్రమే చేసిపెట్టే చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉంటే ఎలా ఉంటుంది? మనల్ని డిజిటల్ వ్యసనానికి దూరంగా ఉంచుతూనే, అవసరమైన పనులను సులభంగా పూర్తి చేసే అలాంటి కొన్ని ఆసక్తికరమైన గ్యాడ్జెట్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో, ఎలా పనిచేస్తాయో చూసేద్దాం!

బ్లూహబ్ (BluHub)

Advertisement

ఇది చూడటానికి చిన్న గ్రాండ్ పియానో లాగా ఉండి చాలా ముద్దుగా ఉంటుంది. మన దగ్గర ఉన్న పాత సీడీలు, డీవీడీలు ప్లే చేసుకోవడానికి, అలాగే ఫొటోలను దాచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకుని మన పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకోవచ్చు. అయితే ఇది చిన్న పాకెట్‌లో సరిపోదు కాబట్టి.. ల్యాప్‌టాప్ బ్యాగులో వేసుకోవాలి. నవంబర్ నాటికి ఇది సేల్‌కి వచ్చే అవకాశం ఉంది.

మాడ్-5 మ్యూజిక్ ప్లేయర్ (MAD-5)

పాటలు వినే అలవాటు ఉన్నవారికి ఇదొక చక్కటి కాన్సెప్ట్ డిజైన్. దీని డిస్‌ప్లే సరిగ్గా ముందు భాగంలో ఉంటుంది కాబట్టి.. మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు షర్ట్‌కి క్లిప్ చేసుకుంటే పాటల వివరాలు క్లియర్‌గా కనిపిస్తాయి. ఫోన్ లేకుండా కేవలం మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్. అయితే ఇది ప్రస్తుతం కేవలం డిజైన్ రూపంలోనే ఉంది. ఇంకా మార్కెట్లోకి అమ్మకానికి రాలేదు.

Advertisement

Also Read: దారి చూపే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? అసలు విషయం ఏమిటంటే..

అనలాగ్ క్యాప్సూల్ కెమెరా (Analog Capsule Camera)

అసలు ఇది కెమెరా అంటే ఎవరూ నమ్మలేరు. అచ్చం సినిమా రీల్ డబ్బా లాగా ఉంటుంది. దీని బరువు కేవలం 25 గ్రాములే. మెడలో వేసుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఫోన్ అన్‌లాక్ చేసి యాప్స్ వెతికే పని లేకుండా, జస్ట్ ఒక క్లిక్‌తో అప్పటికప్పుడు మంచి ఫొటోలు తీసుకోవచ్చు. దీని ధర రూ.4,600 వరకు ఉంటుంది.

ప్లేడేట్ గేమింగ్ కన్సోల్ (Playdate)

ఫోన్ స్క్రీన్ మీద టచ్ చేసి ఆడే ఆటల కంటే.. చేతితో పట్టుకుని ఆడే అనుభూతే వేరు. ఈ పసుపు రంగు చిన్న గేమింగ్ కన్సోల్‌కి పక్కన ఒక చిన్న రాట్నం లాంటి క్రాంక్ ఉంటుంది. దీన్ని తిప్పుతూ గేమ్స్ ఆడొచ్చు. ఇందులో ప్రత్యేకంగా 24 రకాల ఆటలు వస్తాయి. దీని ధర రూ.19,000 వరకు ఉంటుంది. గేమింగ్ ప్రియులకు ఇది మంచి కాలక్షేపం.

కాసాబీమ్ ఎవ్రీడే టార్చ్ (CasaBeam Everyday Flashlight)

ఫోన్ టార్చ్ లైట్ కొంచెం సేపు వేస్తే ఫోన్ హీట్ అయిపోతుంది. అందుకే ఈ చిన్న టార్చ్ బాగుంటుంది. దీని లైట్‌ని మనకు కావలసినట్లు దగ్గరకు లేదా వెడల్పుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని టేబుల్ మీద నిలబెట్టి కూడా వాడొచ్చు. దీని ధర రూ.4,100 ఉంటుంది. సాయంత్రం పూట వాకింగ్ వెళ్లేవాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: రూ.1.34 లక్షల iPhone 17 Pro రూ.94 వేలకేనా? క్రోమా ఆఫర్ వెనుక ఉన్న బిగ్ ట్విస్ట్ ఇదే!

Tags

Related News

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

ఫోన్ వై-ఫై ఆన్‌లో ఉంచుతున్నారా? జాగ్రత్త

రూ.899కే హై-ఎండ్ ఫీచర్లు..బడ్జెట్ ధరలో బేస్ లవర్స్ కోసం పర్ఫెక్ట్

దారి చూపే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? అసలు విషయం ఏమిటంటే..

Big Stories

Advertisement
×