SIFPA: ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. భారతీయ సినిమాలు హాలీవుడ్ సినిమాలకు దీటుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో కొన్ని సవాలను కూడా ఎదుర్కొంటుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తలెత్తిన సమస్యలకు చెక్ పెట్టడం కోసం సౌత్ ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్ అసోసియేషన్ (SIFPA)రెండో సమావేశాన్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నిర్మాతలు పాల్గొన్నారు.
దక్షిణ భారత సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాత మండల్లు, గిల్డ్స్ , ఇతర ప్రతినిధి సంస్థలు ఈ సమావేశంలో పాల్గొని పరిశ్రమకు సంబంధించిన పలు కీలక విషయాల పట్ల చర్చలు జరిపారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్మాణ వ్యయాలు, థియేట్రికల్ ఎగ్జిబిషన్, OTT విండోయింగ్ విధానాలు, వర్క్ ఫోర్స్ సమన్వయం, ఫిల్మ్ ఫైనాన్స్ స్థిరత్వం అలాగే దక్షిణ భారత భాషల చిత్ర పరిశ్రమల మధ్య సహాయ సహకారాల గురించి ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పారదర్శకత స్థిరత్వం సమిష్టి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ఏకతాటిపై నిర్మాణాత్మక వ్యవస్థను ఏర్పాటు చేయడ కోసం సౌత్ ఇండస్ట్రీ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమ కట్టుబాట్లను పునరుద్గాటించారు.
ఇలా ఈ సమావేశంలో పలు కీలక విషయాల గురించి SIFPA చర్చలు జరిపారు. అలాగే తదుపరి ఈ సమావేశం 2026 జూన్ 14న కొచ్చిలో నిర్వహించబడుతుందని తెలుస్తుంది .ఈ సమావేశంలో భాగంగా మరికొన్ని నిర్మాణాత్మక చర్చల గురించి ప్రస్తావించబోతున్నారు. ఇక నేడు జరిగిన ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై మరిన్ని నిర్మాణాత్మక నిర్ణయాలను తీసుకోవడంతోపాటు చిత్ర పరిశ్రమ ప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమాలను కూడా తదుపరి సమావేశంలో నిర్ణయించబోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో సమస్యలను ఎదుర్కోవడం కోసం దక్షిణాది చిత్ర నిర్మాతలు అదరూ ఏకతాటిగా కలిసి రావడంతో వీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజులలో భారతీయ చిత్ర పరిశ్రమని దిశా నిర్దేశం చేస్తా అనడలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి జూన్ 14వ తేదీ కొచ్చిలో నిర్వహించబోయే సమావేశంలో భాగంగా SIFPA ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది.
Also Read: విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం.. పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్!