E-Paper
Advertisement

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!
Advertisement

Spirit Movie Update:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ చూసి మురిసిపోతున్నారు రెబల్ ఫ్యాన్స్.అంతేకాదు.. సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఇపుడు నెట్టింట్ ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే డిబేట్లు పెట్టేస్తున్నారు మూవీ లవర్స్.

ఇక రిలీజ్ అయిన కొత్త పోస్టర్‌ చూస్తే ప్రభాస్ బ్లాక్ క్యాప్, కూలింగ్ గ్లాసెస్, గుబురు గడ్డంతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా చాలా సీరియస్‌గా, పవర్‌ఫుల్ లుక్‌లో ఉన్న ఆయనను చూస్తుంటే సినిమాలో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది.

Advertisement

పోస్టర్‌లో ప్రభాస్ మొహాన్ని క్లోజప్‌లో చూపిస్తూ సింపుల్‌గా డిజైన్ చేసినా, ఆయన లుక్ మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోందనడంలో సందేహం లేదు. దీంతో ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందా ఆరాలు తీస్తున్నారు మూవే లవర్స్.

ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయానికి వస్తే.. ‘స్పిరిట్’ను 2027 అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్ . నిజానికి మొదట్లో 2027 మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ సినిమా షెడ్యూల్స్ అనుకున్నంత వేగంగా జరగకపోవడంతో సినిమా రిలీజ్ పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది.అంటే రెబల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా స్పిరిట్ ని థియేటర్ లో చూడాలంటే మరిన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదన్న మాట.

Advertisement

అయితే అదే నెలలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా , సాయిపల్లవి సీతగా నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయాణ పార్ట్ 1 రిలీజ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాల పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇక తాజాగా రిలీజ్ డేట్ కన్ఫాం చేయడంతో మూవీ కి సంబంధించిన వరుస అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయా అని క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఇక సందీప్ రెడ్డి వంగా విషయానికి వస్తే ఆయన సినిమాలకి ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సందీప్ అదే కథను హిందీలో ‘కబీర్ సింగ్’ గా తీసి బాలీవుడ్ లో సత్తా చాటాడు .ఇక ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో చేసిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంతో సందీప్ ఒక్క సారిగా టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయాడు.దీంతో
ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి.

ఇక ‘స్పిరిట్’విషయానికి వస్తే ప్రభాస్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇందులో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను భూషణ్ కుమార్‌కు చెందిన టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .చూడాలి మరి భారీ అంచనాలతో రాబోతున్న సినిమా ఎలాంటి అంచనాలని అందుకుంటుందో !

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Check this out…….. 😊 #Spirit #InSpiritMode @TSeries @VangaPictures #IndiasBiggestSuperStar 29TH OCTOBER DIWALI 2027 💥 Worldwide RELEASE DATE 👆 https://t.co/SmPjKHzuVE</p>&mdash; Sandeep Reddy Vanga (@imvangasandeep) <a href=”https://x.com/imvangasandeep/status/2111705018177028530?ref_src=twsrc%5Etfw”>October 18, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>

Tags

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×