E-Paper
Advertisement

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ రెండు స్థానాల్లో గెలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శనివారం కీలక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్యలతో పాటు రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, ఇన్ చార్జీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాంచందర్ రావు మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. గతంలో ఈ రెండు స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికల్లో రామ్మోహన్ రావు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎవరనే దానితో సంబంధం లేకుండా, పార్టీ గెలుపే ధ్యేయంగా కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని నేతలకు సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడితో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఓటరు నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

కాంగ్రెస్, BRS తో జాగ్రత్త!

Advertisement

విద్యావంతులను ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు, పోలింగ్ రోజున వారు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. సమాజంలో బీజేపీపై విద్యావంతులు, గ్రాడ్యుయేట్లలో బలమైన సానుకూలత ఉందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో దేశ ప్రతిష్టను దిగజార్చేలా సాగుతున్న ఓట్ చోరీ ప్రచారం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం దాగి ఉందని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు క్షేత్రస్థాయిలో తగిన సమయం కేటాయించి పార్టీని విజయతీరాలకు చేర్చాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

Also Read: ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

Tags

Related News

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

Big Stories

Advertisement
×