E-Paper
Advertisement

Sree Leela: తల్లికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన శ్రీలీల.. ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ!

Sree Leela: తల్లికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన శ్రీలీల.. ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ!
Advertisement

Sree Leela:కన్నడ ముద్దుగుమ్మ అయిన శ్రీలీల (SreeLeela ) తెలుగులో ‘పెళ్లి సందD’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన అమాయకపు చూపులతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే మాస్ మహారాజా రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో కాస్త తడబడిన శ్రీ లీల వరుసగా డిజాస్టర్ లను మూట కట్టుకుంటూ వచ్చింది. ఇక మధ్యలో గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నా.. అనుకున్నంత స్థాయిలో శ్రీ లీల లకు గుర్తింపు అయితే లభించలేదు.

ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ లీల..

దీనికి తోడు ఇటీవల తమిళ్ లో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా వచ్చిన ‘పరాశక్తి’ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. చాలా వరకు రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. దాంతో థియేటర్లలో అనుకున్న కలెక్షన్లు కూడా రాబట్ట లేకపోయింది ఈ చిత్రం. ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ ఒక క్యాప్షన్ కూడా జోడించడమే కాకుండా తన తల్లితో గడిపిన బెడ్ టైమ్ సందర్భాలకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. అంతేకాదు పులి తల్లి ఒడిలో ఒదిగిపోయిన పిల్లలా తన తల్లిని హత్తుకొని ప్రేమగా తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

తల్లి ఒడిలో ఒదిగిపోయి మరీ..

Advertisement

అంతేకాదు తన తల్లి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఉన్న ఫోటోని కూడా పంచుకుంటూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.365 రోజులలో ప్రతిక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటావు. నిస్వార్థ ప్రేమ అంటే ఎలా ఉంటుందో నిన్ను చూశాకే నాకు అర్థం అయింది ముఖ్యంగా నీతో పంచుకునే బంధం నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు ధైర్యంగా ఉండడం నేర్పించావు. కానీ నేను నా కొద్దిపాటి తెలివితేటలతో కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నీకు నేర్పిస్తాను. నాకు అన్ని జన్మలలో కూడా నువ్వే నాకు తల్లిగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ తన తల్లికి స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ముఖ్యంగా తన తల్లి చిన్ననాటి ఫోటోని పంచుకోవడం ఆమెకు మరింత సర్ప్రైజ్ ను ఇచ్చిందని చెప్పవచ్చు.

ALSO READ:Netflix: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న 7 సినిమాలు.. మీ ఫేవరెట్ మూవీ కూడా?

శ్రీలీల ప్రస్తుత సినిమాలు..

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హీరోగా, హరీష్ శంకర్ (Harish Shankar)దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరొకవైపు హిందీలో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది..కనీసం అక్కడైనా శ్రీ లీల సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×