E-Paper
Advertisement

Viral Video: తాను తోపు అన్నాడు.. కాసేపు ఆనందం పంచాడు, చివరకు బెడ్ ఎక్కాడు?

Viral Video:  తాను తోపు అన్నాడు.. కాసేపు ఆనందం పంచాడు, చివరకు బెడ్ ఎక్కాడు?
Advertisement

Viral Video: సినిమాలు.. సోషల్ మీడియా వంటివి యువతపై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. ఫలితంగా హాయిగా కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన వయస్సులో ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేస్తూ ఆసుపత్రి పాలయ్యారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

జార్ఖండ్ కాలేజీ స్టూడెంట్ ప్రమాకర స్టంట్స్

Advertisement

సినిమాలు.. సోషల్ మీడియా వంటివి యువతపై బాగానే ప్రభావం చూపుతున్నాయి.  తెలుగులో నాగార్జున నటించిన ‘వారసుడు’ సినిమా వచ్చింది. ఈ చిత్రం వచ్చి దాదాపు రెండు లేదా మూడు దశాబ్దాలు అవుతోంది. కాలేజీకి బైక్‌పై వెళ్లిన సందర్భంలో చేసిన ఫీట్స్ చూసి చాలామంది ప్రేక్షకు ఎంజాయ్ చేశారు. ఆ మాదిరిగా స్టంట్స్ చేయాలని భావించాడు కాలేజీ యువకుడు. ఏకంగా కాలేజీకి డుమ్మా కొట్టేసి ఖాళీగా ఉన్న రోడ్లపై స్టంట్స్ చేశాడు.

చివరకు ముఖమంతా డ్యామేజ్ చేసుకుని బెడ్ ఎక్కాడు. ఈ మధ్యకాలంలో బైక్‌లపై డేంజరస్ స్టంట్స్ చేయడం మొదలు పెట్టారు పని పాటా లేని కొందరు యువకులు. ఒకర్ని చూపి మరొకరు ఇలా చేస్తుకుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ కొందరు యువకులు ఇలాంటివి చేసేవారు.

Advertisement

గాల్లో తేలిపోయి చివరకు బెడ్ ఎక్కాడు

ట్రెండ్ మారింది.. ఖాళీగా రోడ్డు ఎక్కడుంటే అక్కడ బైక్‌పై స్టంట్స్ చేస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ స్టూడెంట్స్ కాలేజీకి డుమ్మా కొట్టాడు. ఆ సమయంలో ఏం చెయ్యాలో తెలియక ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుని ఖాళీ రోడ్లపై బైక్‌పై విన్యాసాలు చేశాడు. బైక్‌పై ఒక్కడే కాకుండా వెనుక మరో ఫ్రెండ్‌ని కూర్చో బెట్టుకుని చేశాడు. మరొకరు స్టంట్స్‌ని వీడియో షూట్ చేశాడు.

ఈ వీడియో వెనుక ధూమ్ సినిమాలో మ్యూజిక్ యాడ్ చేశారు. బైక్ పై నిలబడి చేతులు వదిలేసి ‘మేఘాల్లో తేలిపొమ్మన్నది’ అన్న రేంజ్‌లో స్టంట్స్ చేశాడు. చివరకు బైక్ హ్యాండిల్ ఒక్కసారిగా తిరగడంతో జారి కిందపడ్డాడు. చివరకు కుడి చేతి మణికట్టు, నుదురు, ముక్కకు గాయాలు అయ్యాయి. అంతేకాదు యువకుడి బ్రీథింక్ లెవల్స్ కూడా పడిపోయాయి.

ALSO READ: కళ్ల ముందే ఘోరం.. ఆ తల్లి చేసిన చిన్న పొరపాటు ఎంతటి ప్రమాదానికి దారితీసిందంటే?

కొడుకు యాక్సిడెంట్ విషయం తెలియగానే పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎదిగిన కొడుకుని బెడ్‌పై ఆ విధంగా చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.  ఇలాంటి విన్యాసాలు చేయవద్దని పదేపదే పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ తిరుగుతోంది.  దీనిపై ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×