E-Paper
Advertisement

Tarun Career: లవర్ బాయ్ తరుణ్ ఫేడ్ అవుట్ అవ్వడానికిక కారణం ఇదే.. విజయ్ భాస్కర్

Tarun Career: లవర్ బాయ్ తరుణ్ ఫేడ్ అవుట్ అవ్వడానికిక కారణం ఇదే.. విజయ్ భాస్కర్
Advertisement

Tarun Career: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి చిత్రాలతో లవర్ బాయ్‌గా ఒక వెలుగు వెలిగిన హీరో తరుణ్. ఒక దశలో యువతలో సెన్సేషన్‌గా మారిన ఈ హీరో, ఆ తర్వాత కొంత కాలంగా ప్రేక్షకులకు కనబడటమే మానేశారు. అడపా దడపా సినిమా పార్టీల్లో మాత్రమే కనిపించారు. సినిమాలకు దాదాపు దూరం అయ్యారు. అయితే ఆయన సినిమాకు దూరం కావడానికి గల కారణాలను, అసలు ఆయన ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యారనే విషయంపై ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Read also-Suspens Thriller OTT : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

ఇమేజ్ మార్చుకోవాలనే ప్రయత్నం

Advertisement

విజయ్ భాస్కర్ అభిప్రాయం ప్రకారం, తరుణ్ తనకున్న ‘సాఫ్ట్ రొమాంటిక్ హీరో’ ఇమేజ్ నుండి బయటపడి, యాక్షన్ హీరోగా నిరూపించుకోవాలని ప్రయత్నించడమే ఆయన కెరీర్‌కు మైనస్ అయ్యింది. ఆ సమయంలో అందరూ యాక్షన్ సినిమాలు చేస్తున్నారని, తరుణ్ కూడా అటువైపే మొగ్గు చూపారని ఆయన తెలిపారు. అయితే అది వర్క్ అవుట్ కకపోవడంపై అసలు ఇప్పడు సినిమాలే తీయడంలేదు. అప్పటికే దర్శకుడు విజయ్ భాస్కర్ తరుణ్ ను హెచ్చరించినట్లు తెలిపారు.. “నీకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. నువ్వు అందరిలా యాక్షన్ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. నీకు రొమాంటిక్ డ్రామాలు బాగా సెట్ అవుతాయి” అని తాను అప్పట్లోనే తరుణ్‌కు సూచించినట్లు విజయ్ భాస్కర్ వెల్లడించారు.

తరుణ్‌కు విషయం అర్థం కావడానికి ఆయన అమితాబ్ బచ్చన్, అమోల్ పలేకర్ ఉదాహరణలను చెప్పేవారట. అమితాబ్ బచ్చన్ పెద్ద యాక్షన్ సినిమాలు చేస్తున్న కాలంలోనే, అమోల్ పలేకర్ తనదైన శైలిలో క్లాసిక్ సినిమాలు చేస్తూ గొప్ప విజయాన్ని అందుకున్నారని, తరుణ్ కూడా తన బలాన్ని (రొమాంటిక్ సినిమాలు) నమ్ముకోవాల్సిందని ఆయన అన్నారు. తరుణ్ యాక్షన్ సినిమాల కోసం వేచి చూడటం లేదా అలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల కొన్ని అవకాశాలు చేజారాయని, అప్పుడు చేసిన కొన్ని సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Read also-Barabar Premistha: యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి నిర్మాత ఏం చేశారో తెలుసా.. ఇది హైలెట్..

రీ-ఎంట్రీ

తరుణ్ చాలా తెలివైన నటుడని, కేవలం కొన్ని నిర్ణయాలు లేదా కాలం కలిసి రాకపోవడం వల్లే గ్యాప్ వచ్చిందని విజయ్ భాస్కర్ అన్నారు. సరైన కథ కుదిరితే తరుణ్‌తో మళ్ళీ సినిమా చేయడానికి తాను సిద్ధమేనని, ఇప్పటికీ ప్రేక్షకులు తరుణ్‌ను మిస్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తరుణ్ తల్లి రోజారమణి కూడా తరుణ్ సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారని, త్వరలోనే ఆయన నుండి ఒక మంచి సినిమా వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×