Sree Vishnu: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నుంచి రాబోతున్న హిలేరియస్ జాయ్‌రైడ్ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam). యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా, ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ బుధవారం మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శ్రీవిష్ణు కోతి బొమ్మను పట్టుకుని వచ్చారు. అదేంటని అడిగితే.. ఈ రోజు నా గ్రహస్థితి ఏం బాగోలేదు. అందుకే ఓ కోతి పిల్ల పక్కన ఉంటే బాగుంటుందని జ్యోతిష్యులు చెప్పారు. నిజమైన కోతి పిల్ల అయితే కరుస్తుందేమో అని భయమేసి ఇది తీసుకొచ్చానంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇందులో ఆయన జాతకాలను నమ్మే వ్యక్తిగా నటించిన విషయం తెలిసిందే. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
Also Read- Virosh Wedding: విజయ్ రష్మికల పెళ్లికి వచ్చే అతిథులు, పెళ్లిలో నోరూరించే మెనూ వివరాలివే!
‘‘ఈ ‘విష్ణు విన్యాసం’ సినిమా మొదలవడానికి మొదటి కారణం చారి. ఆయన ద్వారానే దర్శకుడు యదునాథ్ మారుతీ రావు పరిచయమయ్యారు. ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అలాగే నిర్మాతలు సుబ్రమణ్యం, సుమంత్ సినిమాను అద్భుతంగా ప్రొడ్యూస్ చేశారు. వారితో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాకు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. వారి బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాను చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటారు. ఈ సినిమా చాలా రోజులు గుర్తుంటుంది. మా టెక్నీషియన్స్ డీవోపీ సాయి శ్రీరామ్, ఎడిటర్ కార్తీ, మ్యూజిక్ రధన్ అందరికీ థాంక్యు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ థాంక్యూ సో మచ్. అందరూ అద్భుతంగా చేశారు.
Also Read- Aura of Ustaad: ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’.. అసలు వినిపించడం లేదుగా!
హీరోయిన్ నయన్ సారిక చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఆమెది ఇందులో స్ట్రాంగ్ క్యారెక్టర్. తను ముందు ముందు మరింత మంచి స్థాయికి వెళ్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు మారుతీ రావు ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటాడు. చాలా మంచి మనిషి. ఆయనకు సినిమా తప్పితే మరో ప్రపంచం తెలీదు. ‘విష్ణు విన్యాసం’ ఫస్టాఫ్ అంతా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌కి సినిమా ఫ్యామిలీ డ్రామాగా మారిపోతుంది. సినిమా పూర్తయ్యేసరికి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇది ష్యూర్ షాట్ సూపర్ హిట్ సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి నవ్వుకోడానికి థియేటర్లకు రావాలని ప్రేక్షకులను కోరుతున్నాను. కచ్చితంగా ప్రతి ఒక్కరూ 100 శాతం నవ్వుకుంటారు. అలా నవ్వించే బాధ్యత నాది. ఫిబ్రవరి 27న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు.
Also Read- Divi Vadthya: స్ట్రీట్ షాపింగ్ తో బిజీగా మారిన దివి.. ఆ మెరుపు చూసారా?