Virosh Wedding: గత కొన్నాళ్లుగా సాగుతున్న అతిపెద్ద సస్పెన్స్‌కు ఇంకొన్ని గంటల్లో తెరపడబోతోంది. ‘గీత గోవిందం’ (Geetha Govindam) జోడి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) నిజజీవితంలోనూ ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న అత్యంత విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ హోటల్ ఈ వేడుకకు వేదికైంది. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం రెండు కుటుంబాలు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నాయి. ఆడంబరాల కంటే భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగబోతోంది. సాధారణంగా స్టార్ వెడ్డింగ్ అంటే వేల సంఖ్యలో అతిథులు ఉంటారు. కానీ, విజయ్-రష్మిక మాత్రం తమ పెళ్లి (ViRosh Wedding)ని చాలా ప్రైవేట్‌గా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే కేవలం 100 మందికి మాత్రమే ఆహ్వానాలు పంపినట్లుగా తెలుస్తోంది. ఈ లిస్టులో కుటుంబ సభ్యులతో పాటు వీరి కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన దర్శకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు.
Also Read- Aura of Ustaad: ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’.. అసలు వినిపించడం లేదుగా!
తెలంగాణకు చెందిన కొందరు కీలక రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అంబానీ ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే టాలీవుడ్ నుంచి డైరెక్టర్లు తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, రాహుల్ రవీంద్రన్, నటి ఈషా రెబ్బా ఉదయ్‌పూర్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎలాంటి హడావిడి లేకుండా, కేవలం తమకు ఇష్టమైన వారి మధ్య విరోష్ జంట ఒక్కటి కానుంది. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ.. ఈ పెళ్లి చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వేడుకకు బయటి వ్యక్తులు, మీడియా ఫోటోగ్రాఫర్లకు అనుమతి లేకుండా ‘నో ఫోన్ పాలసీ’ని కూడా అమలు చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అరుపులు, కేకలు లేకుండా, ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఈ వేడుక నిర్వహించడమే వీరి ఉద్దేశంగా తెలుస్తోంది.
Also Read- Shanmukh Jaswanth:వైష్ణవితో ఘనంగా జరిగిన షణ్ముఖ్ జశ్వంత్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..
ఈ పెళ్లిలో అతిథులకు ఇచ్చే విందు భోజనం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తెలంగాణకు చెందినవాడు, రష్మిక కర్ణాటక అమ్మాయి కావడంతో.. రెండు రాష్ట్రాల రుచులు కలిపి అదిరిపోయే మెనూని సిద్ధం చేశారనేటా టాక్ నడుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. మెయిన్ వెడ్డింగ్ ఈవెంట్‌లో అతిథులకు కొబ్బరి నీళ్లతో స్వాగతం పలికి, అరిటాకులో సంప్రదాయబద్ధంగా వడ్డించి ట్రెడిషనల్ టచ్ ఇవ్వనున్నారట. హైదరాబాదీ ధమ్ బిర్యానీ, పాతబస్తీ ఫేమస్ కీమా సమోసా, నాటుకోడి పులుసు, గారెలు, పప్పు, పచ్చి పులుసు వంటి ఏపీ, తెలంగాణకు చెందిన లోకల్ వంటకాలు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటక స్పెషల్‌గా రష్మిక నేటివ్ స్టైల్ వంటకాలైన కదంబుట్టు (రైస్ బాల్స్), పాండి కర్రీ, నూల్ పుట్టు వంటి వాటితో పాటు మైసూర్ పాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం.
Also Read- Suriya: సూర్యకి అతని తమ్ముడు కార్తీలో నచ్చని విషయం ఏమిటో తెలుసా..?