E-Paper
Advertisement

Peddi Movie: ఏంటి ‘పెద్ది’ మళ్లీ వాయిదానా? బాబాయ్.. ఈ ట్వీట్స్ ఏంటి?

Peddi Movie: ఏంటి ‘పెద్ది’ మళ్లీ వాయిదానా? బాబాయ్.. ఈ ట్వీట్స్ ఏంటి?
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబోలో వస్తున్న ‘పెద్ది’ (Peddi Movie) సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా మొదట చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. రీసెంట్‌గానే షూటింగ్ పనులు పూర్తి కాలేదని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘పెద్ది’ వాయిదా పడటంతో ఏప్రిల్‌లో అనుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా మార్చి 26కు డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే.. ఏప్రిల్ 30న కూడా ఈ సినిమా రావడం కష్టమే అన్నట్లుగా.. ఈ మధ్య ట్విట్టర్ ఎక్స్‌లో హడావుడి చేస్తున్న మీడియా మేధావులు పోస్ట్‌లు పెడుతున్నారు. దీనితో చరణ్ ఫ్యాన్స్‌లో మళ్లీ అయోమయం మొదలైంది.

Also Read- Kanchana 4: ‘కాంచన 4’ కూడా మార్చిలోనే.. మరి ప్రమోషన్స్ సంగతేంటి?

మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో..

Advertisement

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘పెద్ది’ షూటింగ్ ఇంకా 25 రోజుల వరకు పెండింగ్‌లో ఉందట. ముఖ్యంగా ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్, రీ-రికార్డింగ్ విషయంలో టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని, దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుందని టాక్. ఒకవేళ ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తి కాకపోతే, సినిమా మే నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారానికి వెళ్లే అవకాశం ఉందంటూ ఎక్స్‌లో హడావుడి మొదలైంది. పైగా మార్చి 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి, ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని మేకర్స్ భావిస్తున్నా.. అప్పటికీ అంతా సిద్ధమవుతుందా? లేదా అనే అనుమానంలో టీమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Virosh Wedding: విజయ్ రష్మిక‌ల పెళ్లికి వచ్చే అతిథులు, పెళ్లిలో నోరూరించే మెనూ వివరాలివే!

ఆలస్యం అందుకేనా?

Advertisement

అయితే, చిత్ర యూనిట్ మాత్రం ఈ వార్తలను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. డైరెక్టర్ బుచ్చిబాబు తన టీమ్‌తో కలిసి పనులను వేగవంతం చేశారని, ఎలాగైనా ఏప్రిల్ 30 డెడ్ లైన్ అందుకోవాలని చూస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా చూసి కొన్ని మార్పులు సూచించారని, ఆ రీ-షూట్స్ వల్ల కూడా కొంచెం ఆలస్యం కావచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, సినిమా టీజర్, సెకండ్ సింగిల్ అప్‌డేట్స్ కోసం చూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ వాయిదా వార్తలు మింగుడు పడటం లేదు. త్వరలోనే మేకర్స్ ఈ రిలీజ్ డేట్ గందరగోళంపై ఒక క్లారిటీ ఇస్తే తప్ప ఈ టెన్షన్ తగ్గదు. చూద్దాం.. మరి ఈ వార్తలపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో? అధికారిక ప్రకటన వచ్చే వరకు చరణ్ ఫ్యాన్స్‌కు టెన్షన్ తప్పదు.

Also Read- Shanmukh Jaswanth:వైష్ణవితో ఘనంగా జరిగిన షణ్ముఖ్ జశ్వంత్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×