E-Paper
Advertisement

నక్కతోక తొక్కిన శ్రీవిష్ణు.. క్రేజీ డైరెక్టర్స్ తో 4 ప్రాజెక్టులు.. ఫ్లాప్ హీరోకి ఎందుకింత డిమాండ్?

నక్కతోక తొక్కిన శ్రీవిష్ణు.. క్రేజీ డైరెక్టర్స్ తో 4 ప్రాజెక్టులు.. ఫ్లాప్ హీరోకి ఎందుకింత డిమాండ్?
Advertisement

Sree Vishnu:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న శ్రీ విష్ణు ఎక్కువగా కామెడీని నమ్ముకుని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా ఆయన రూట్ మార్చి సినిమాలు చేశారు. అవేవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో శ్రీ విష్ణు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ హీరోగా నిలిచిపోయాడు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన మృత్యుంజయ, విష్ణు విన్యాసం సినిమాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఆశించిన ఫలితాన్ని రాబట్ట లేకపోయాయి.

శ్రీ విష్ణు దగ్గరికి క్యూ కడుతున్న దర్శకులు..

అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ హీరోగా కొనసాగుతున్న శ్రీ విష్ణు కి డైరెక్టర్లు మాత్రం వరుసగా క్యూ కట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక హీరో ఒక సినిమాతో డిజాస్టర్ గా నిలిచాడు అంటే మళ్ళీ ఆ హీరో దగ్గరికి దర్శకులు వెళ్లడం చాలావరకు ఆలస్యం అవుతుంది. అలాంటిది ఇప్పుడు రెండు మూడు సినిమాలతో డిజాస్టర్ అందుకున్న హీరోకి డైరెక్టర్లు వరుసగా క్యూ కట్టడం చూసి ఇదెక్కడి క్రేజ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. మొత్తానికైతే శ్రీ విష్ణు రేంజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది అనే కామెంట్లు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరి ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు శ్రీ విష్ణు నక్కతోక తొక్కాడ అంటూ కామెంట్లు చేస్తున్నారు

Advertisement

 

సినిమా లైనప్ అదుర్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తిచేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే శ్రీ విష్ణు కెరియర్ లో మైలురాయిగా నిలిచిన సామజ వరగమన సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజుతో శ్రీ విష్ణు మరోసారి జతకట్టడం విశేషం. ఇప్పటికే ఈ కాంబినేషన్లో రాబోతున్న హిలేరియస్ కామెడీ డ్రామా పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు చిత్రాలతో పాటు భాను భోగవరపుతో కలసి మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కథ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ:Kissik Talks: కర్మ అనుభవించాల్సిందే.. చేసిన తప్పు ఊరికేపోదు – అర్జున్ కళ్యాణ్

సలహా ఇస్తున్న అభిమానులు..

అంతేకాదు రంగబలి దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో రూపొందనున్న విభిన్న కథా చిత్రంలో కూడా శ్రీ విష్ణు నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాలన్నీ కూడా ఈయన మార్కెట్ ను పెంచేలా కనిపిస్తున్నాయి. అయితే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూనే తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈ విషయం విన్న నెటిజన్స్ మాత్రం వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి అంటే మీ మీద నమ్మకంతోనే ఆ అవకాశాలు మీ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి.. కథల నాణ్యతపై దృష్టి పెట్టాలని అభిమానులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని కూడా కోరుతున్నారు.

బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

శ్రీ విష్ణు కి ఉన్న ప్రధాన బలం ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ.. వీటిని సరిగా వాడుకుంటూనే రొటీన్ ఫార్ములాకు భిన్నంగా కొత్తదనం ఉండేలా చూసుకోవాలని కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి శ్రీ విష్ణు ఇకనైనా ఫ్లాప్ హీరో అనే మార్క్ ను చెరిపేసుకొని మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×