E-Paper
Advertisement

మార్కెట్ లోకి మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ.. న్యూ ఛేంజెస్ ఏంటో తెలుసా?

మార్కెట్ లోకి మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ.. న్యూ ఛేంజెస్ ఏంటో తెలుసా?
Advertisement

Maruti Baleno 2026 Update: మారుతి బాలెనో మార్కెట్లోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు మంచి అమ్మకాలతో మార్కెట్ లో సత్తా చాటుతోంది. ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌ లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. ఇప్పుడు ఈ కారుకు చిన్న అప్‌ డేట్ చేయబోతోంది. ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ లో తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో ఈ కొత్త మోడల్ కు సంబంధించిన స్పై షాట్స వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త వెర్షన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కొత్త ఫేస్ లిఫ్ట్ లో మార్పులు ఏంటి?

ఈ ఫేస్‌ లిఫ్ట్‌ లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అవసరమైన చోట చిన్న చిన్న మెరుగులు యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్ బయట డిజైన్‌ లో కొంత ఫ్రెష్ లుక్ ఇవ్వడానికి ముందు భాగం అంటే, ఫ్రంట్ గ్రిల్, లైట్స్, వెనుక భాగంలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ఈ మార్పులు కారు పూర్తిగా కొత్తగా అనిపించకపోయినా, చూసే వారికి కొత్త ఫీలింగ్ ఇస్తాయి.

ఇంటీరియర్ లోనూ కొత్త అప్ డేట్స్

Advertisement

ఇంటీరియర్ విషయంలో కూడా కొన్ని అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది. పెద్ద టచ్‌ స్క్రీన్, కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, అలాగే ముందరి సీట్లకు వెంటిలేషన్ వంటి ఫీచర్లు యాడ్ చేసే అవకాశం ఉంది. ఇవి ఇప్పటికే కొన్ని ఇతర మారుతి మోడళ్లలో కనిపిస్తున్నాయి. సో, బాలెనోలో కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్‌ లో మెరుగైన ట్యాంక్ సెటప్ కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చాలా మంది ఆశించేలా భారీ మార్పులు ఈ ఫేస్‌ లిఫ్ట్‌ లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బాలెనో మంచి సేల్స్ సాధిస్తోంది. కంపెనీకి పూర్తిగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న అప్‌ డేట్స్‌ తోనే కస్టమర్ల ఆసక్తిని కలిగించే అవకాశం ఉంది.

SUV మోడళ్లపై ఎక్కువ ఫోకస్

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మార్కెట్లో SUV కార్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మారుతి కూడా తన ఫోకస్ ఎక్కువగా SUV మోడళ్లపైనే పెడుతోంది. బాలెనో లాంటి హ్యాచ్‌ బ్యాక్‌ లకు పెద్దగా పెట్టుబడి పెట్టకుండా, అవసరమైనంత వరకు మాత్రమే అప్‌ డేట్స్ ఇస్తోంది.

ధర ఎంత ఉంటుందంటే?

Advertisement

ధర విషయంలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు. ప్రస్తుతం బాలెనో ధర సుమారు రూ.7.2 లక్షల నుంచి రూ.9.1 లక్షల వరకు ఉంది. ఫేస్‌ లిఫ్ట్ తర్వాత కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. దీంతో మరింత తక్కువ ధరలో అందుబాటులో ఉండే ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ గా కొనసాగుతుంది.  బాలెనో.. టయోటా గ్లాంజా, హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ లాంటి కార్లకు పోటీ ఇస్తుంది.

Read Also: టయోటాలో చవకైన కారు.. జస్ట్ రూ. 6.5 లక్షలకే కొనేయండి బ్రో!

Related News

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×