E-Paper
Advertisement

Sree Vishnu Mrithyunjay Trailer: జూ. ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్!

Sree Vishnu Mrithyunjay Trailer: జూ. ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్!
Advertisement

Sree Vishnu Mrithyunjay Trailer:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీ విష్ణు (Sri Vishnu) సామజవరగమన చిత్రం తర్వాత రెబా మోనికా జాన్ (Reba Monika John) తో కలసి మరోసారి నటించిన చిత్రం మృత్యుంజయ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) చేతుల మీదుగా విడుదల చేశారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ హుస్సేన్ షాకిరణ్ దర్శకత్వం వహించగా.. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మృత్యుంజయ్ ట్రైలర్ ఎలా ఉందంటే?

మృత్యుంజయ్ ట్రైలర్ విషయానికి వస్తే.. శ్రీ విష్ణు డైలాగుతో ఈ ట్రైలర్ ను ప్రారంభించారు.” ఇప్పుడు నా చేతుల్లో ఒక చిక్కుముడి ఉంది. ఆ చిక్కుముడి విప్పుతా.. కచ్చితంగా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తా.. ఇట్స్ మై ప్రామిస్” అంటూ ఒక చిన్నారికి భరోసా ఇస్తూ.. ట్రైలర్ ను స్టార్ట్ చేశారు. క్రైమ్ బ్యూరోలో చేరడానికి విభిన్న ప్రాంతాల గెటప్లలో శ్రీ విష్ణు కనిపించిన తీరు ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో మౌనిక రెబా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపించనుంది. “ఓడిపోవడం తప్పు కాదు ఓడిపోతానని ప్రయత్నం చేయకపోవడం తప్పు” అంటూ ఐశ్వర్య భాస్కరన్ చెప్పే డైలాగ్ మరింత ఆకట్టుకుంది. మా నాన్నకు అలా ఎందుకు అయిందని ఒక చిన్నారి ప్రశ్నించిన తీరు.. మరొకవైపు మా అమ్మా నాన్నకు అలా ఎందుకు అయింది అని అడిగిన మరో అబ్బాయి ప్రశ్నకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. అసలు ఏం జరుగుతోంది ? పిల్లల తల్లిదండ్రులు ఎందుకు మరణిస్తున్నారు? అనే సస్పెన్స్ తో ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన ఇన్వెస్టిగేషన్ జానర్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మార్చి ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మృత్యుంజయ్ సినిమాతో శ్రీ విష్ణు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Advertisement

also read:Varalakshmi Sarathkumar: సరస్వతి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. లేడీ సూపర్ స్టార్ చేతుల మీదుగా ఆ రోజే లాంచ్!

శ్రీ విష్ణు కెరియర్..

బాణం , సోలో వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీ విష్ణు.. ఎన్నో చిత్రాలలో సెకండ్ హీరో గా కూడా నటించి ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన గాలి సంపత్, రాజరాజ చోర, అర్జున ఫల్గుణ, బ్రోచేవారెవరురా , ఓం భీమ్ బుష్, స్వాగ్ , సింగిల్ అంటూ పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తాజాగా విష్ణు విన్యాసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు మృత్యుంజయ్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Advertisement

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×