E-Paper
Advertisement

EV Sales February 2026: ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల జోష్, టాప్ లో టీవీఎస్, ఏడో స్థానానికి పడిపోయిన ఓలా!

EV Sales February 2026: ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల జోష్, టాప్ లో టీవీఎస్, ఏడో స్థానానికి పడిపోయిన ఓలా!
Advertisement

TVS Motor Dominates February EV Sales: ఫిబ్రవరి 2026లో ఇండియన్ ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్ లో టీవీఎస్  మోటార్ సత్తా చాటింది. అమ్మకాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. అయితే, ఓలా ఎలక్ట్రిక్ మరింత దిగజారింది. ఏకంగా ఏడవ స్థానానికి పడిపోయింది. టాప్ బ్రాండ్ల నుంచి గట్టిపోటీతో ఓలా చతికిలపడుతోంది.

నెంబర్ వన్ గా టీవీఎస్ మోటార్

ప్రభుత్వ వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఫిబ్రవరి 2026లో మొత్తం ఎలక్ట్రిక్ టూవీలర్స్ రిజిస్ట్రేషన్లు 101,059 యూనిట్లుగా ఉన్నాయి. టీవీఎస్ మోటార్ ఏకంగా 29,231 యూనిట్లతో మార్కెట్‌ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 28.9 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఈ బ్రాండ్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది.

Advertisement

అటు బజాజ్ ఆటో 22,942 రిజిస్ట్రేషన్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. 22.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీకి చెందిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కు మంచి డిమాండ్ కొనసాగుతోంది. ఐక్యూబ్ తర్వాత అదే స్థాయిలో ఈ స్కూటర్ కు నిరంతర డిమాండ్ కొనసాగుతోంది. అటు ఏథర్ ఎనర్జీ 18,726 యూనిట్లతో 18.5 శాతం వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. ఈ బ్రాండ్ కు సంబంధించిన 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి అమ్మకాలను కొనసాగుతున్నాయి.

Read Also: ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. క్రేజీ లుక్, అదిరిపోయే మైలేజ్!

Advertisement

మరోవైపు హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా 11,356 రిజిస్ట్రేషన్లు సాధించింది. 11.2 శాతం మార్కెట్ వాటాతో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. ఇతర బ్రాండ్ల విషయానికి వస్తే, ఆంపియర్ 4.2 శాతం వాటాతో 4,203 యూనిట్లను నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ 3,783 యూనిట్లను నమోదు చేసి, 3.7 శాతం వాటాతో మార్కెట్లో ఏకంగా ఏడవ స్థానానికి పడిపోయింది. టీవీఎస్, బజాజ్, ఏథర్, విడా లాంటి  పోటీ కంపెనీల కంటే వెనుకబడి ఉంది. రివర్, బిగాస్ వరుసగా 2,018, 1,849 యూనిట్ల నమోదనును సాధించాయి. ఇ స్ప్రింటో, సింపుల్ ఎనర్జీ తక్కువ మొత్తంలో నమోదులను సాధించాయి.

ఓలా మార్కెట్ మరింత పతనం

ఎవరూ ఊహించని విధంగా ఓలా ఎలక్ట్రిక్ ఏడవ స్థానానికి పడిపోయింది. 2023, 2024 ప్రారంభంలో ఈ కంపెనీ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటిగా కొనసాగింది. కొన్నిసార్లు నెలవారీ రిజిస్ట్రేషన్లలో ముందంజలో ఉంది. కానీ,  TVS మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ లాంటి తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ పోర్ట్‌ ఫోలియోలు, డిస్ట్రిబ్యూషన్ ను విస్తరించడంతో ఓలా మార్కెట్ గణనీయంగా తగ్గింది.  అటు చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలు 5,521 యూనిట్లు లేదంటే, మొత్తం రిజిస్ట్రేషన్లలో 5.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

Read Also: కొత్తదంటూ ‘యాక్సిడెంట్’ కారు విక్రయం, టాటా షోరూమ్ లో రచ్చ.. ఇవి తెలియకపోతే ఇంతే!

 

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×