Sree Vishnu: యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) ఫుల్ జోష్ మీద ఉన్నారు. వారం గ్యాప్‌లో ఆయన నటించిన రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. అందులో మొదటిదైన హిలేరియస్ జాయ్‌రైడ్ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam)తో ఆయన ప్రేక్షకులని పలకరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు (Yadunaath Maruthi Rao) దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా, ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్‌కు శ్రీ విష్ణు స్ట్రాంగ్ ఝలక్ ఇచ్చారు.
ఈ మధ్యకాలంలో చిరంజీవి అనగానే ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలోకి ఎగేసుకుని వస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి గురించి మీకేం తెలుసురా? అది, ఇది అని భారీ స్థాయిలో పదాలు వాడుతూ, క్లాస్‌లు ఇస్తున్నారు. ఆయన చెప్పే విషయం కరెక్టే అయినా, ఆయన విధానం మాత్రం అంతా చిరంజీవే అన్నట్లుగా మారిపోయింది. ఎవరిని కదిలించినా చిరంజీవి ప్రస్తావన లేకుండా ఆయన ప్రశ్న కూడా వేయలేకపోతున్నారు. ఒక రకంగా ఆయన చిరంజీవి ఫోబియా ఉందనేలా నెటిజన్లు కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. సరే విషయంలోకి వస్తే.. ‘విష్ణు విన్యాసం’ ప్రమోషన్స్‌లో భాగంగా సదరు జర్నలిస్ట్.. ‘మీరు కూడా చిరంజీవి అభిమానేనా?’ అని ప్రశ్నించారు. అందుకు శ్రీ విష్ణు.. ‘చిరంజీవిగారంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి’ అని సమాధానమిచ్చారు.
Also Read- Harish Shankar: ‘ఉస్తాద్’లో ఎలివేషన్స్ ఉంటాయ్.. ఎటకారపు ధోరణి ఉండదు
అంతటితో ఆగితే బాగుండేది. ‘అంటే రెండు రకాలు సార్.. కొంతమంది చెప్పరు. రవితేజ, నాని వంటి వారు బాహాటంగా చెప్తారు. సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్ నేషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎటువంటి హెజిటేషన్ లేకుండా చిరంజీవి పేరు చెప్పాడు. చిరంజీవిని ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు’ అని జర్నలిస్ట్ అంటుండగానే.. ‘నాకు చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారంటే చాలా ఇష్టమండి. అంటే అందరూ ఇష్టమే కానీ, చిన్నప్పటి నుంచి ఎందుకో ఎక్కువగా వెంకటేష్ గారంటే చాలా ఇష్టం’ అని అనగానే జర్నలిస్ట్ ఫేస్ వాడిపోయింది. వాస్తవానికి శ్రీ విష్ణు మొదటి నుంచి వెంకటేష్‌కు వీరాభిమాని. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు, చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. పబ్లిగ్గానే ఆయన చెప్పారు. మరి ఈ జర్నలిస్ట్ వరకు ఆ విషయం వెళ్లలేదో.. లేదంటే ఫోబియా ప్రకారం అలా అడిగేశాడో.. అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి ఫ్యాన్ కానీ వాడు ప్రపంచం లో ఎవడూ లేడు చిరంజీవి అను కుల జర్నలిస్ట్
నేను వెంకటేష్ ఫ్యాన్ హీరో శ్రీ విష్ణు
— 𝔲𝔪𝔞𝔫𝔞𝔱𝔥 (@NTRGazette) February 23, 2026
Also Read- Social drama OTT : తప్పిపోయిన కూతురి కోసం తల్లి ఆరాటం… ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ డ్రామా