E-Paper
Advertisement

Romantic Thriller OTT : షాహిద్ కపూర్ లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే

Romantic Thriller OTT : షాహిద్ కపూర్ లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే

Romantic Thriller OTT : వాలంటైన్స్ డే సమయంలో థియేటర్లలో అడుగుపెట్టిన సినిమా ‘ఓ రోమియో. ఇది 2026 ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబైలో జరిగిన రియల్ మాఫియా సంఘటనల ఆధారంగా ఈ స్టోరీ సాగుతుంది. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, అందులో సగం మొత్తాన్ని కూడా వసూలు చేసుకోలేక పోయింది. అయితే షాహిద్ కపూర్ తన నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఇది ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O’ Romeo) ను ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి, తమన్నా భాటియా, అవినాష్ తివారీ, నానా పటేకర్, దిశా పటానీ, విక్రాంత్ మాసే వంటి నటులు నటించారు. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా ఓ రోమియో కావడం విశేషం. ఐఎమ్‌డీబీలో 6.5 రేటింగ్ ఉన్న ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను, ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి బాలీవుడ్ సినిమాలు. దీన్ని బట్టి ఏప్రిల్ లో ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కి అందుబాటులో ఉంటుంది. అయితే రెంటల్ పద్ధతిలో మరింత ముందుగా వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

ఈ స్టోరీ1980ల నాటి ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగుతుంది. తన భర్తను అన్యాయంగా చంపిన మాఫియా డాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సప్నా దీదీ (త్రిప్తి డిమ్రి) నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు హుస్సేన్ ఉస్తారా (షాహిద్ కపూర్) అనే గ్యాంగ్‌స్టర్ తోడవుతాడు. అతను ఆమెకు ఆయుధాలు వాడటం నేర్పించడమే కాకుండా, తన లక్ష్యం కోసం ప్రాణాలకు తెగించేలా తయారు చేస్తాడు.
కథలో అసలైన మలుపు ఏంటంటే, వాళ్లిద్దరూ కలిసి తమ శత్రువును వేటాడే క్రమంలో ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. ఒక పక్క ప్రతీకారం, మరో పక్క ప్రాణాలను పణంగా పెట్టే రిస్క్ ఉన్నా సరే, వీళ్ళ మధ్య ప్రేమ చాలా ఆసక్తిగా నడుస్తుంది. ఇక గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగే గొడవలు, ముంబై వీధుల్లో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు, ఒక మహిళ గ్యాంగ్‌స్టర్‌గా మారిన తీరును విశాల్ భరద్వాజ్ చాలా గ్రిట్టీగా చూపించారు.

Read Also : 17 ఏళ్లకే గ్యాంగ్ స్టర్… ఒళ్ళు జలదరించేలా ఒక్కో సీన్… అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×