E-Paper
Advertisement

Social drama OTT : తప్పిపోయిన కూతురి కోసం తల్లి ఆరాటం… ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ డ్రామా

Social drama OTT : తప్పిపోయిన కూతురి కోసం తల్లి ఆరాటం… ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ డ్రామా
Advertisement

Social drama OTT  : వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘సరస్వతి’ (Saraswathi). ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల హీరో నాని విడుదల చేశారు. ట్రైలర్ కి మాత్రం అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా 2026 మార్చి 6 థియేటర్లలో విడుదల కానుంది. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అప్పుడే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తలుసుకుందాం.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

వరలక్ష్మి, ఆమె సోదరి పూజా శరత్‌కుమార్ తమ సొంత బ్యానర్ దోశ డైరీస్ పై ‘సరస్వతి’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ తెలుగు దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ లో ఆమె ప్రధాన పాత్రను కూడా పోషించింది. ప్రకాశ్‌ రాజ్‌, రాధిక, నాజర్‌, ప్రియమణి కీలకపాత్రల్లో నటించగా.. తమన్‌ సంగీతం అందించారు. ఇందులో ప్రియమణి నెగెటివ్ పాత్రలో కనిపించనుంది. వరలక్ష్మి, ప్రియమణి మధ్య జరిగే కోర్టు రూమ్ డ్రామా సినిమాకు హైలైట్‌ గా నిలవనుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ETV Win ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ETV Winలో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సరస్వతి (వరలక్ష్మి శరత్‌కుమార్) అనే ఒక సాధారణ తల్లి ఉంటుంది. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమె తల్లడిల్లిపోతుంది. తన బిడ్డను వెతకడానికి పోలీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ సరైన సాయం చేయరు. కానీ తన కూతురి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ఆ తల్లి, ఒంటరి పోరాటం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో కథ ఊహించని మలుపులు తిరగనుంది. ఇక స్టోరీలో కోర్టు డ్రామా చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. తన కూతురికి ఏం జరిగింది? ఆమెను ఎవరు తీసుకెళ్లారు? అనే నిజాలను బయటపెట్టడానికి సరస్వతి న్యాయపోరాటం చేస్తుంది. ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి పవర్‌ఫుల్ నటుల మధ్య జరిగే వాదనలు, ట్విస్టులు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. చివరికి ఒక తల్లి తన పట్టుదలతో వ్యవస్థను ఎలా ఎదిరించి న్యాయం సాధించింది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Read Also : ఓటీటీలోకి మరో మలయాళం డ్రామా… థియేటర్లకు వెళ్లకుండానే వారణాసి నేపథ్యంలో వస్తున్న మూవీ

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×