E-Paper
Advertisement

శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!

శ్రీలీల చిన్నప్పటి ‘భరతనాట్యం’ వీడియో చూశారా? ఏం టాలెంట్ గురూ!
Advertisement

Sree Leela:అందాల తార, అభినయ సుందరి మల్టీ టాలెంటెడ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది శ్రీ లీల (SreeLeela) . నిర్మాతల మనిషిగా ఇండస్ట్రీలో బిజీగా మారిన ఈమె.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు తన చదువుపై దృష్టి సారించింది. అలా ముఖానికి రంగు వేసుకుంటూ.. తెరపై కనిపించిన ఈమె.. మరొకవైపు జీవితంలో ఉన్నతంగా ఎదగడం కోసం తన ప్యాషన్ ని కూడా మరువలేదు. షూటింగ్ సెట్లో కష్టపడుతూనే ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు తిరిగేస్తూ ఎట్టకేలకు ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ గా అవతరించింది శ్రీ లీల.

9 ఏళ్ల వయసులో భరతనాట్యంతో ఆకట్టుకున్న శ్రీ లీల..

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమె.. మరొకవైపు ఒక అద్భుతమైన వీడియోతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది శ్రీ లీల. 9 ఏళ్ల వయసులో శ్రీకృష్ణుడి అల్లరి చేష్టలను నాట్యం రూపంలో అద్భుతమైన ముఖ కవళికలను కనబరిచి అందరి హృదయాలను దోచుకుంది. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంత టాలెంటా అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. కృష్ణయ్య అల్లరి చేష్టలు.. కళ్ళతో హావభావాలు పలికిస్తూ.. చిన్ని చిన్ని చేతులతో.. ముద్దులొలికే పాదాలతో స్టేజిపై భరతనాట్యం చేస్తుంటే చూసేవారి కన్నులు ధన్యం అయ్యాయనే చెప్పాలి.. అంత అద్భుతంగా శ్రీ లీల భరతనాట్య ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇకపోతే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీలీలా పంచుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ:చిక్కుల్లో పడ్డ హీరో కార్తీ.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణపై కామెంట్స్!

ఫ్యామిలీ గ్రూప్ లో ప్రత్యక్షమైన వీడియో..

కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ లీల తల్లి ఈ వీడియోని తన వాట్స్అప్ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేశారట. ఈ వీడియోని తన అభిమానులతో కూడా పంచుకోవాలనుకున్న శ్రీలీల వెంటనే తన అధికారిక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియోని షేర్ చేశారట . అయితే ఈ విషయాన్ని స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. మొత్తానికి అయితే శ్రీ లీల భరతనాట్యానికి సంబంధించిన ఈ వీడియో మాత్రం అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోందని అని చెప్పవచ్చు.

శ్రీ లీల సినిమాలు..

Advertisement

రవితేజతో ధమాకా సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీలకి మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అయితే లభించడం లేదు. అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోనైనా తన స్టార్ డంను మరింత పెంచుకోవాలని చూసింది. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్తో కలిసి ఒక బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో హిందీ అరంగేట్రం చేస్తోంది. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఓం చాప్టర్ 1: ఉదిరం అనే చిత్రంలో నటిస్తోంది . మరి ఈ సినిమాలైనా ఈమెకు మంచి విజయాన్ని అందించాలని ఆశిద్దాం..

Related News

చిక్కుల్లో పడ్డ హీరో కార్తీ.. స్టార్ హీరోయిన్ వస్త్రధారణపై కామెంట్స్!

వారణాసి చిత్రంపై అదిరిపోయే న్యూస్.. బుల్ ఫైట్ షూటింగ్ ఎప్పుడంటే?

ప్రభుదేవా ‘మూన్ వాక్ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగుతున్నాడే..!

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

Big Stories

Advertisement
×