E-Paper
Advertisement

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

కియా సోరెంటో వచ్చేసింది..  ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!
Advertisement

New Kia Sorento Launched: ప్రీమియం SUV కొనాలని చూస్తున్న వారికి కియా మోటార్స్ కొత్త ఆప్షన్‌ ను తీసుకొచ్చింది.   ఫ్లాగ్‌ షిప్ ICE SUV సోరెంటోను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.27.99 లక్షలుగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కియా ప్లాంట్‌లో ఈ SUVను తయారు చేస్తున్నారు. 2023లో   వచ్చిన నాలుగో ఫోర్త్ జెనరేషన్ సోరెంటోకు ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. 3 వరుసల SUVగా వచ్చిన ఈ కారు ఆరు ట్రిమ్‌లలో లభిస్తుంది. వీటిలో HTE, HTE(O), HTK, HTK(A), HTX, HTX(A) వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రూ.27.99 లక్షల నుంచి రూ.40.19 లక్షల వరకు

సోరెంటో ధరలు వేరియంట్‌ను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. బేస్ డీజిల్ 7 సీటర్ ధర రూ.27.99 లక్షలు కాగా, టాప్ స్పెక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ 6-సీటర్ ధర రూ.40.19 లక్షల వరకు ఉంది. HTK(A), HTX, HTX(A) వేరియంట్లకు అదనంగా రూ.20,000 చెల్లించి ‘బ్లాక్ లైన్’ స్టైలింగ్ ప్యాక్‌ ను తీసుకోవచ్చు. HTX, HTX(A)లో ఆల్ వీల్ డ్రైవ్ అందుబాటులో ఉంటుంది. ‘A’ వేరియంట్లలో ADAS ఫీచర్లు లభిస్తాయి.

రెండు పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లు

Advertisement

కియా సోరెంటోలో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.6 లీటర్ టర్బో పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ 180hp, 265Nm ఉత్పత్తి చేస్తుంది. దీనికి 65hp, 264Nm అందించే ఎలక్ట్రిక్ మోటార్ జతగా ఉంటుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో వచ్చే ఈ పవర్‌ ట్రెయిన్ FWD, AWD ఆప్షన్లలో లభిస్తుంది. ఇక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 193hp పవర్, 442Nm టార్క్‌ ను అందిస్తుంది. దీనికి 8 స్పీడ్ DCT గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. డీజిల్ వెర్షన్ కూడా FWD, AWD ఆప్షన్లలో లభిస్తుంది. అన్ని వేరియంట్లలో నార్మల్, ఎకో, స్పోర్ట్, స్మార్ట్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. AWD మోడళ్లలో స్నో, సాండ్, మడ్ అనే మూడు టెర్రైన్ మోడ్‌లు అడిషనల్ గా ఉన్నాయి.

ఆకట్టుకునే SUV డిజైన్

సోరెంటో ముందు భాగంలో కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ ఉంటుంది. నిలువుగా అమర్చిన LED హెడ్‌లైట్లు, Y ఆకారపు DRLs, LED ఫాగ్ ల్యాంప్స్ డిజైన్‌ కు మరింత లుక్ ను అందిస్తున్నాయి. 19 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, బ్లాక్ క్లాడింగ్ కూడా ఉన్నాయి.

అదిరిపోయే లగ్జరీ ఫీచర్లు

Advertisement

క్యాబిన్‌లో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్ ఉన్నాయి. మార్వెల్, డిస్నీ, పిక్సార్ నుంచి తొమ్మిది కస్టమైజ్ చేసుకునే థీమ్‌లు కూడా ఉన్నాయి. 12 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, HUD, పవర్డ్ టెయిల్‌ గేట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 6 సీటర్‌లో కెప్టెన్ చైర్స్, 7 సీటర్‌ లో బెంచ్ సీటు ఉంటుంది. సేఫ్టీ పరంగా 10 ఎయిర్‌ బ్యాగ్‌ లు, 360 డిగ్రీ కెమెరా, డిజిటల్ IRVM, ఆటో పార్కింగ్ అసిస్టెన్స్, ముందు, వెనుక డాష్‌ క్యామ్‌లు, TPMS వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా లెవల్ 2+ ADAS కూడా అందుబాటులో ఉంది. కియా సోరెంటో జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్, వోక్స్‌ వ్యాగన్ టెరాన్ లాంటి SUVలతో పోటీ పడనుంది.

Read Also: టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

Tags

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×