E-Paper
Advertisement

Google Maps AI: గూగుల్ మ్యాప్స్‌లో AI.. వాకింగ్, సైక్లింగ్ కోసం హ్యాండ్స్-ఫ్రీ నావిగేషన్

Google Maps AI: గూగుల్ మ్యాప్స్‌లో AI.. వాకింగ్, సైక్లింగ్ కోసం హ్యాండ్స్-ఫ్రీ నావిగేషన్
Advertisement

Google Maps AI| ఇప్పుడందరూ ఎక్కడికైనా తెలియని అడ్రస్‌కు చేరుకోవాలంటే గూగుల్ మ్యాప్‌లో ఉపయోగిస్తున్నారు. గూగుల్ ఈ సర్వీస్‌లో తాజాగా వాకింగ్, సైక్లింగ్ యూజర్లకు కొత్త ఫీచర్ జోడించింది. జెమిని AI సపోర్ట్‌తో హ్యాండ్స్-ఫ్రీ నావిగేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. గతంలో జెమిని డ్రైవింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మోడ్‌లకు మాత్రమే పనిచేసేది. ఇప్పుడు కాలినడకన వెళ్లేవారు, సైకిల్‌పై ప్రయాణించేవారు.. కూడా స్మార్ట్ వాయిస్ అసిస్టెన్స్ ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ప్రయాణాన్ని సులభం, సేఫ్, ఇంటరాక్టివ్‌గా చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్‌లో జెమిని ఎలా యాక్టివేట్ చేయాలి?

వాకింగ్ లేదా సైక్లింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ పైన కుడి వైపు జెమిని ఐకాన్‌పై ట్యాప్ చేయండి. లేదా “హే గూగుల్” అని చెప్పి జెమినిని స్టార్ట్ చేయవచ్చు. ఫోన్‌ను టచ్ చేయకుండానే నావిగేషన్ సులభమవుతుంది. చేతులు బిజీగా ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరం.

పర్సనల్ టూర్ గైడ్ లాగా పనిచేసే జెమిని ఏఐ

Advertisement

జెమిని ప్రయాణంలో పర్సనల్ టూర్ గైడ్‌లా మారింది. దగ్గరలో ఉన్న ప్లేసెస్, ల్యాండ్‌మార్క్స్ గురించి అడగవచ్చు. రెస్టారెంట్లు, కేఫేలు, ఆకర్షణల గురించి సమాచారం ఇస్తుంది. ప్రస్తుతం ఏ ఏరియాలో ఉన్నారో వివరిస్తుంది. వాకింగ్ ట్రిప్స్ మరింత ఆనందకరంగా, ఇన్ఫర్మేటివ్‌గా మారతాయి.

సైక్లిస్టులకు మరింత బెనిఫిట్స్

సైక్లిస్టులకు జెమిని హ్యాండ్స్-ఫ్రీ సపోర్ట్ చాలా ఉపయోగకరం. అరైవల్ టైమ్, రూట్ అప్‌డేట్స్ అడగవచ్చు. మెసేజెస్ పంపమని కూడా చెప్పవచ్చు. ఫోన్ ఓపెన్ చేయకుండానే మెసేజెస్ పంపుతుంది. రోడ్డు, ట్రాఫిక్‌పై దృష్టి పెట్టడం సులభమవుతుంది.

సేఫ్టీ, కన్వీనియన్స్ మెరుగుదల

Advertisement

ఈ అప్‌డేట్ సేఫ్టీ, కంఫర్ట్ రెండింటినీ పెంచింది. వాకింగ్ లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ అన్‌లాక్ చేయాల్సిన అవసరం లేదు. డిస్ట్రాక్షన్స్ తగ్గి యాక్సిడెంట్ రిస్క్ తగ్గుతుంది. సరౌండింగ్స్‌పై దృష్టి పెట్టడం సులభమవుతుంది. వాయిస్ కంట్రోల్‌తో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.

పాత వాయిస్ కమాండ్స్ స్థానంలో జెమిని ఏఐ

ఇప్పుడు జెమిని గూగుల్ మ్యాప్స్ పాత వాయిస్ కమాండ్స్ స్థానంలో వచ్చింది. ఇతర గూగుల్ సర్వీసెస్‌తో కనెక్ట్ అయి బెటర్ రెస్పాన్స్ ఇస్తుంది. పార్కింగ్, EV చార్జింగ్ స్టేషన్స్, పెట్రోల్ పంప్స్ గురించి అడగవచ్చు. దగ్గరలో హోటళ్లు, పబ్లిక్ ప్లేసెస్ గురించి స్మార్ట్ ఆన్సర్స్ ఇస్తుంది.

ల్యాండ్‌మార్క్ బేస్డ్ డైరెక్షన్స్

గూగుల్ ల్యాండ్‌మార్క్ బేస్డ్ నావిగేషన్ పరిచయం చేసింది. అంటే ఆ మార్గంలోనే కిలోమీటర్ల బదులు దగ్గరలో ఉన్న బిల్డింగ్స్, షాపులు ఏమున్నాయో సూచిస్తుంది. ఉదాహరణకు ఇంతకుముందు 100 మీటర్ల తరువాత కుడి వైపు తిరగండి అని వచ్చేది కానీ ఇప్పుడు “నీలోఫర్ కేఫే తర్వాత కుడికి తిరగండి” అని చెబుతుంది. దీంతో యూజర్‌కు సులభంగా అర్థమవుతుంది.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో అందుబాటు

ఈ ఫీచర్ గ్రాడ్యువల్‌గా రోల్ అవుట్ అవుతోంది. జెమిని అందుబాటులో ఉన్న దేశాల్లో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు అప్‌డేట్ పొందుతారు. గూగుల్ మ్యాప్స్ అప్‌డేట్ చేసుకోవాలి. కొత్త ఫీచర్లకు యాక్సెస్ లభిస్తుంది.

గూగుల్ మ్యాప్స్‌ను జెమిని ఏఐ మరింత ఇంటెలిజెంట్, ఇంటరాక్టివ్‌గా మార్చింది. సేఫ్టీ, నావిగేషన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగవుతాయి. వాకింగ్, సైక్లింగ్ స్మార్ట్ వాయిస్ గైడెన్స్‌తో మరింత సులభమవుతాయి. ఆధునిక ప్రయాణ అవసరాలకు సరిపోతుంది. కొత్త ప్రదేశాలను అన్వేషించడం మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×