E-Paper
Advertisement

Peddi: మొన్న బన్నీ.. నేడు చరణ్..లక్కీ ఛాన్స్ పట్టేసిన శ్రీలీల ..?

Peddi: మొన్న బన్నీ.. నేడు చరణ్..లక్కీ ఛాన్స్ పట్టేసిన శ్రీలీల ..?
Advertisement

Peddi: అందాల భామ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నా కూడా విజయాలను మాత్రం అందుకోలేకపోతుంది. ఈ మధ్యనే జూనియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అమ్మడు ఆశలన్నీ మాస్ జాతర మీదనే పెట్టుకుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో ధమాకా లాంటి భారీ హిట్ సినిమా వచ్చిన విషయం తెల్సిందే.

ధమాకా తరువాత శ్రీలీల ఎన్నో సినిమాలు చేసింది. అయినా అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక మధ్యలో ఈ చిన్నది ఐటెంగర్ల్ గా కూడా మారింది. అల్లు అర్జున్ , రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 లో కిస్సిక్ గర్ల్ గా మెరిసింది. ఆ సినిమాలో అమ్మడు చేసిన ఆ సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో  భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సాంగ్ తరువాత శ్రీలీల.. జూనియర్ లో వైరల్ వయ్యారి సాంగ్ తో మరింత పాపులర్ అయ్యింది.

Advertisement

ఇక ఇప్పుడు శ్రీలీల మరో లక్కీ ఛాన్స్ పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది.  జాన్వీ కపూర్ హీరోయిన్ గా. నటిస్తున్న ఈ చిత్రం కోసం టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని, అందులో శ్రీలీల, రామ్ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప 2 లో బన్నీతో చేసిన కిస్సిక్ డ్యాన్స్ తరువాత అందరూ అమ్మడిని శ్రీలీల అని కాకుండా కిస్సిక్ బ్యూటీ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఈ చిన్నది ఈ ఛాన్స్ పట్టేస్తే  అమ్మడికి మించిన లక్కీ బ్యూటీ ఇంకొకరు ఉండరు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగక తప్పదు.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×