Mahavatar Narasimha OTT: ఇటీవల కాలంలో స్టార్ డైరెక్టర్స్ రూటు మార్చుకుంటున్నారు. యాక్షన్ సినిమాలను తెరకెక్కించే మాస్ డైరెక్టర్స్ సైతం డివోషనల్ స్టోరీతో కొత్త జానర్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అందులో పురాణాల పై కొన్ని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దేవుళ్ళ కథల తో కొత్త సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈమధ్య వస్తున్న సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహకు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతోంది.. ఈ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.. ఇక ప్రస్తుతం దీని ఓటీటీ వివరాల గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది..
‘మహావతార్ నరసింహ’ ఓటీటీ..
అశ్విని కుమార్ దర్శకత్వం వహించగా… ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ బ్యానర్లో నిర్మించారు. రిలీజ్కు ముందు పెద్దగా అంచనాలు లేకపోవడంతో ‘మహావతార్: నరసింహ’ పై ఏ ఓటీటీ సంస్థ కూడా అంతగా ఆసక్తి చూపలేదు. రిలీజ్ అయ్యాక మంచి టాక్ తో దూసుకుపోవడం తో పాటుగా కొద్ది రోజుల్లోనే 100 కోట్లను వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఈ మూవీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ‘జియో హాట్స్టార్’ కు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థతో ఉన్న పరిచయాలను బట్టి ఆ ఓటీటీకే రైట్స్ దక్కే అవకాశాలు ఉన్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు.. భారీ ధరకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్ల కు పైగానే డీల్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
స్ట్రీమింగ్ అప్పటి నుంచే..?
నిజానికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మహావతార్: నరసింహ’ విషయానికొస్తే ప్రస్తుతం థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్, ఫుల్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో 8 వారాల తర్వాత సెప్టెంబర్ చివర్లో ఓటీటీలోకి రావొచ్చని అంచనా.. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
100 కోట్లు దాటిన కలెక్షన్స్..
యానిమేషన్ చిత్రంగా వచ్చిన ఈ మూవీగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 100 కోట్లను వసూల్ చేసింది. ఇప్పటివరకూ ఇండియా వైడ్గా రూ.105 కోట్లు వసూలు చేసినట్లు ‘హోంబలే ఫిల్మ్స్’ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటే మరిన్ని రికార్డులు సైతం సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ ఫ్రాంచైజీలో రెండో మూవీ మహావతార్: పరశురామ్ 2027లో రానున్నట్లు డైరెక్టర్ అశ్విని కుమార్ తెలిపారు. అది ఇంకా అద్భుతంగా ఉండనున్నట్లు వెల్లడించారు. విష్ణుమూర్తి 10 అవతారాలపై యానిమేటెడ్ మూవీస్ నిర్మించనున్నట్లు ‘హోంబలే ఫిల్మ్స్’ ఇప్పటికే ప్రకటించింది. రెండేళ్లకు ఒకటి రిలీజ్ కానుంది. 2037 వరకు సినిమాలు ఒక్కొక్కటి రాబోతున్నాయి. మరి ఈ చిత్రానికి దక్కిన రెస్పాన్స్ అన్ని సినిమాలకు అందుతుందేమో చూడాలి.