OnePlus Nord Discount| వన్‌ప్లస్ బ్రాండ్‌లో పాపులర్ ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ CE4 Lite (OnePlus Nord CE4 Lite 5G). ఈ ఫోన్ జూన్ 2024లో లాంచ్ అయింది. లాంచ్ తరువాత మంచి ఫీచర్స్ తక్కువ ధరలో ఉండడంతో త్వరగా పాపులర్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ ధర తగ్గింపు వచ్చింది. ఒరిజినల్ ధర రూ.20,999. ఇప్పుడు 23 శాతం డిస్కౌంట్ తర్వాత ₹16,262కి దొరుకుతోంది. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో చాలా మంచి వాల్యూ ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువకు కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనపు డిస్కౌంట్ వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌తో రూ.814 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. దీంతో ఫైనల్ ధర దాదాపు రూ.15,000కి తగ్గుతుంది.బడ్జెట్‌లో 5G ఫోన్ కావాలనుకునేవారికి ఇది అద్భుతమైన డీల్ అవుతుంది.
ఈ ఫోన్‌లో 6.67 ఇంచ్ Full HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1080*2400 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి. కలర్స్ వైబ్రెంట్‌గా, విజువల్స్ క్లియర్‌గా కనిపిస్తాయి. డిజైన్ కూడా మోడరన్‌గా ఉంటుంది.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ టాస్క్‌లు, మల్టీటాస్కింగ్ సులభంగా నడుస్తాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OxygenOS 14 ఇంటర్‌ఫేస్ ఉంది. క్లీన్, యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ ఇస్తుంది. స్మూత్ అనుభవం కోసం బాగా ఆప్టిమైజ్ చేశారు.
50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. 2MP డెప్త్ సెన్సార్‌తో పోర్ట్రెయిట్ షాట్స్ బాగా వస్తాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. ఫోటోలు స్టేబుల్‌గా, క్లియర్‌గా వస్తాయి. 16MP ఫ్రంట్ కెమెరా EIS సపోర్ట్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ అద్భుతంగా ఉంటాయి.
5500mAh పెద్ద బ్యాటరీ ఉంది. సాధారణ ఉపయోగంలో రెండు రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. రోజంతా ఆందోళన లేకుండా ఉపయోగించవచ్చు.
ఫోన్‌లో 5G కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్స్ దొరుకుతాయి. WiFi 5, Bluetooth 5.1, GPS, USB Type-C పోర్ట్ ఉన్నాయి. రోజువారీ ఉపయోగానికి స్మూత్ కనెక్షన్ ఇస్తుంది.
OnePlus Nord CE4 Lite 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు దొరుకుతోంది. పర్‌ఫామెన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లతో మరింత సేవింగ్స్ పొందవచ్చు. బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ
ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న స్మార్ట్‌ఫోన్స్ లేదా దాని ధరలు.. ఆయా బ్రాండ్ కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కొనుగోలు చేసేప్పుడు జాగ్రత్తగా పరిశీలించి కొనాలని వినియోగదారులకు సూచన. పైన చెప్పిన ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు.