E-Paper
Advertisement

Sreemaha Vishnu: ఆ టైటిల్ ఏంటి? ఆ పోస్టర్ ఏంటి? అసలేంటీ ఛండాలం?

Sreemaha Vishnu: ఆ టైటిల్ ఏంటి? ఆ పోస్టర్ ఏంటి? అసలేంటీ ఛండాలం?
Advertisement

Sreemaha Vishnu: శ్రీ విష్ణు కాదు.. టైటిల్ సరిగా చూడండి.. ‘శ్రీమహా విష్ణు’. ఇది సినిమా టైటిల్. ఈ మధ్యకాలంలో దేవుళ్లపై, ఇతరత్రా అంశాలపై కాంట్రవర్సీ అవుతాయని అనుకుంటే చాలు.. సెన్సార్ టీమ్ చివరి నిమిషంలో అయినా బ్రేక్ వేయడానికి వెనుకాడటం లేదు. రెండు రోజుల్లో రిలీజ్ అనుకున్న సినిమాల టైటిల్స్ కూడా రీసెంట్‌గా ఎలా, ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియని విషయం కాదు. అయినా సరే, ధైర్యంగా ‘శ్రీమహా విష్ణు’ (Sreemaha Vishnu) అనే టైటిల్‌ని మేకర్స్ ప్రకటించారు. ‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన బాలనటుడు, హీరో దీపక్ సరోజ్ (Deepak Saroj).. ఇప్పుడు హరి హరన్ గోధగాని (Hari Haran Godhagani) దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హరి తన్నీరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read- Allu Arjun: శ్రీరామ నవమి..ఆ వ్యక్తికి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్…ఎంత బాగుందో!

మీరు పెట్టిన టైటిల్ ఏంటి?

Advertisement

పవిత్రమైన శ్రీరామనవమి పండుగ సందర్భంగా, చిత్ర బృందం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘శ్రీమహా విష్ణు’ అనే టైటిల్‌తో ఒక రొమాంటిక్ మూవీని తీస్తున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఈ ఫస్ట్ లుక్‌లో హీరో హీరోయిన్ మధ్య లిప్ లాక్ జరుగుతున్నట్లుగా చూపించారు. ఆయిల్ పెయింటింగ్ స్టయిల్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌పై, అలాగే టైటిల్‌పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పడుతున్నాయి. మీరు పెట్టిన టైటిల్ ఏంటి? మీరు వదిలిన ఫస్ట్ లుక్ ఏంటి? చూసుకోవద్దా? అంటూ గట్టిగానే హెచ్చరికలు మొదలయ్యాయి. ‘శ్రీమహా విష్ణు’ అనగానే అంతా దేవుడిపై సినిమా అని భావిస్తారు. కానీ, వీళ్లు ఓ రొమాంటిక్ సినిమా చేస్తున్నారనేది ఈ ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చారు. వారి దృష్టిలో శ్రీమహా అమ్మాయి పేరు, విష్ణు అబ్బాయి పేరు అయి ఉండొచ్చు. వారి, ప్రేమకథ ఇదని చెప్పడానికి ఈ టైటిల్ పెట్టి ఉండొచ్చు.

Also Read- Lakshmi Raai: బికినీ షూట్ లో లక్ష్మీరాయ్ అందాలు.. హీట్ పెంచుతోందిరోయ్!

ప్రతి హృదయానికీ ఒక కథ ఉంటుంది

Advertisement

కానీ, ఆ టైటిల్‌తో కొందరి మనోభావాలు దెబ్బతింటాయనే విషయం తెలియనిదా? లేదంటే, కావాలనే, కాంట్రవర్సీ చేసి, మంచి క్రేజ్‌ని పొందవచ్చని చూస్తున్నారా? ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. కాంట్రవర్సీ సన్నివేశాలు, డైలాగ్స్ మాట్లాడితే సినిమా క్రేజ్‌కు ఉపయోగపడుతుందని, కావాలని చేస్తున్నారు. అలాగే ఈ టైటిల్, పోస్టర్ ఉందని భావించవచ్చు. ‘ప్రతి హృదయానికీ ఒక కథ ఉంటుంది’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌గా ఫిక్స్ చేశారు. ‘‘నేటి ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఎక్కువగా కనెక్ట్ అయ్యే అన్ని అంశాలతో.. ప్రేమను వేడుకలా చూపిస్తూ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా ఈ సినిమా సున్నితంగా తెలియజేస్తుంది’’ అని చిత్ర దర్శకుడు హరి హరన్ అంటున్నారు. అంతా బాగానే ఉంది.. టైటిల్ మాత్రం కరెక్ట్ కాదు, చివరి నిమిషంలో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే మేల్కోండి.. అనేలా నెటిజన్లు ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి.. మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో?

Also Read- Director Maruthi: తదుపరి కథకు తుది మెరుగులు దిద్దుకుంటున్నా.. అందుకు కృషి చేస్తా!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×