E-Paper
Advertisement

Sridevi : తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘కోర్టు’ హీరోయిన్.. హీరో ఎవరంటే..?

Sridevi : తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ‘కోర్టు’ హీరోయిన్.. హీరో ఎవరంటే..?
Advertisement

Sridevi : ఈమధ్య కొత్త హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీలో కొదవలేదు. చిన్న సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది కుర్ర హీరోయిన్లు.. ప్రస్తుతం స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాన్ని అందుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లైనా చాలామంది ప్రస్తుతం తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కోర్టు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీదేవి గురించి అందరికీ తెలుసు. ఈ అమ్మడు తెలుగుతో పాటుగా తమిళ్ళో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఓ బంఫర్ ఆఫర్ పట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఆ మూవీ హీరో ఎవరు? సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళ సినిమాలో ఛాన్స్..

వేరే ఇండస్ట్రీలోని హీరోయిన్లు మరో ఇండస్ట్రీలో సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు. తెలుగు హీరోయిన్లు తమిళ్ మలయాళం లో కూడా నటిస్తూ అక్కడ కూడా ఫేమస్ అవుతున్నారు. తాజాగా ఈ కుర్ర హీరోయిన్ శ్రీదేవి కూడా తమిళంలో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. ‘కోర్ట్’ సినిమాతో నటి శ్రీదేవి పాపులర్‌ అయిపోయింది. అదే ఊపులో తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది.. అంతేకాదు ఈ మధ్య ఆమె కారును కూడా కొన్నారు. ఆ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా కోలీవుడ్ లో పాపులర్  హీరో సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది. కేజేఆర్ అనే నటుడు, నిర్మాత తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయికగా ఇప్పటికే ఎంచుకున్నాడు.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.

Advertisement

Also Read : శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ధీరజ్ గిఫ్ట్ కు ప్రేమ ఫిదా..విశ్వం ట్రాప్ లో అమూల్య..

విజన్‌ సినిమా హౌస్‌..

కోలీవుడ్ లో ఎన్నో చిత్రాలను నిర్మించింది ఈ సంస్థ. అరుళానందు, మ్యాథ్యు అరుళానందు ప్రతిభావంతులైన నటీనటులను, సాంకేతిక వర్గాన్ని ప్రోత్సహించే విధంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు కోర్టు బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు. ఈ బ్యానర్ లో వచ్చిన జ్యో మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నిర్మాణంలో వచ్చిన రెండు సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మూడో చిత్రాన్ని నిర్మిస్తుంది. ఏకన్‌ హీరోగా నటిస్తున్నాడు.. శ్రీదేవి హీరోయిన్. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆహా కళ్యాణం ఫేమ్‌ యువరాజ్‌ చిన్నస్వామి కథ, దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా స్టోరీ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. మరి ఈ మూవీ శ్రీదేవికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.. ఇక సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×