E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి అమర్ వార్నింగ్ 

Nindu Noorella Saavasam Serial Today November 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి అమర్ వార్నింగ్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

మిస్సమ్మ కోసం అనాథ ఆశ్రమం పిల్లలతో కలిసి అమ్ము వాళ్లు హోమం చేయడం ఆరు చూసి ఎమోషనల్ అవుతుంది. మా పిల్లలు సరే పక్కనే ఉన్న ఆ పిల్లలు ఎవరు గుప్త గారు అని అడుగుతుంది. వాళ్లు నీవు పెరిగిన అనాథ ఆశ్రమం పిల్లలు అని చెప్తాడు గుప్త. వాళ్లే చేస్తున్నారు అక్కడ అని ఆరు అడగ్గానే.. నీ సోదరి రుణం తీర్చుకుంటున్నారు.. అర్థం కాలేదా బాలిక. దైవం మానుష రూపేణా అంటారు. ఆ పిల్లల ఆకలి దప్పికలు తీర్చుటకు నీ సోదరి సహాయం చేసినది. అమ్మలా అన్నం పెట్టిన నీ సోదరికి తమ వంతు దైవ సహాయం చేస్తున్నారు. నీ కన్నబిడ్డలతో పాటు ఆ పిల్ల పిచ్చుకలు కూడా నీ సహోదరి కోసం ప్రార్థిస్తున్నారు అని గుప్త చెప్పగానే..

వాళ్ల ప్రయత్నం ఫలిస్తుందా అని ఆరు అడగ్గానే.. రావణుడి కోసం రాముడు వచ్చినప్పుడు కంసుడి కొరకు కృష్ణుడు వచ్చినప్పుడు మానవుడి కొరకు మాధవుడు రాడా తల్లి మానవ సంకల్పానికి దైవ సహాయం తోడైనప్పుడు ఎటుల ఉండునో ఇప్పుడు వీక్షించుము బాలిక. జరగబోయే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడుము బాలిక అని గుప్త చెప్తాడు. ఆరు చూస్తూనే ఉంటుంది. మిస్సమ్మకు స్పృహలోకి వస్తుంది. డాక్టర్లు చెక్‌ చేయడం అంతా బాగానే ఉందని చెప్పడం.. గుడి దగ్గర నుంచి పిల్లుల రావడం మిస్సమ్మకు బొట్టు పెట్టడం.. ఇంట్లో ఇంత విష వాయువు ఉంటే యాదమ్మ, మనోహరి ఎలా తప్పించుకున్నారు.. అని అడుగుతాడు. ఇంతలో ఆనంద్‌ కూడా డాడ్‌ వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే వరకు వాళ్లు ఎక్కడున్నారు అని డౌట్‌ క్రియేట్‌ చేస్తాడు. వాళ్లు ఇంట్లోనే ఎక్కడో ఉండి పాయిజన్‌ గ్యాస్‌ పీల్చుకోకుండా ముక్కు నోరు మూసుకున్నారేమో అంటాడు ఆకాష్‌..

Advertisement

అయితే మనోహరి ఆంటీ, యాదమ్మ మాతో పాటు ఇంట్లోనే ఉన్నా మమ్మల్ని సేవ్‌ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు అంటుంది అంజు. ఇందులో ఏదో మర్మం ఉంది బ్లాక్‌ మ్యాన్‌ పేరును అడ్డం పెట్టుకుని ఇది ఎవరో చేసిన దాడిలా అనిపిస్తుంది అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో అమర్‌ బయటకు వెళ్లి మనోహరి వెళ్లిపోతుంటే.. మనోహరి ఎక్కడికి వెళ్లిపోతున్నావు అని అడుగుతాడు. మిస్సమ్మకు బాగయింది కదా అమర్‌ గుడికి వెళ్లి దండం పెటుకుందామని వెళ్తున్నాము అని చెప్తుంది. అయితే సరే కానీ ఇంట్లో గ్యాస్‌ వస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు అని అమర్‌ అడగ్గానే.. మనోహరి, చంభా షాక్‌ అవుతారు. అమర్ నేను ఆ టైంలో రూంలో ఉన్నాను అమర్‌. రూం క్లోజ్‌గా ఉండటంతో స్మోక్‌ నా రూంలోకి రాలేదు. ఆ తర్వాత భాగీ అరుపులు వినిపించాయి. ఏంటా అని రూం తెరచి చూస్తే.. అప్పటికే స్మోక్‌ అంతా నిండిపోయింది. అదేదో ప్రమాదకరమైన స్మోక్‌ లా ఉందని నేను నోరు ముక్కు మూసుకున్నాను.. ఆ స్మోక్‌ లో భాగీ అంజు ఎక్కడున్నారో అసలు నాకు కనిపించలేదు అమర్‌.. అంతే.. అని చెప్పగానే..

అమర్‌ అనుమానంగా ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు యాదమ్మ అని అడగ్గానే.. చంభా తడబడుతూ నేను మేడ పైన ఉన్నాను సార్‌ అని చెప్పగానే.. నువ్వు భాగీకి కేర్‌ టేకర్‌గా వచ్చావు తన పక్కన ఉండకుండా టెర్రస్‌ పైన ఏం చేస్తున్నావు.. అని అమర్‌ అడగ్గానే.. బట్టలు ఆరేయడానికి వెళ్లాను సార్‌.. అప్పటికే ఇంట్లోంచి పొగలు వస్తున్నాయని చూసి కిందకు వచ్చాను ఆ పొగల్లో నాకు ఏవీ కనిపించ లేదు సార్‌.. అని చంభా చెప్పగానే.. నిన్ను ఎప్పుడూ భాగీ పక్కనే ఉండమని చెప్పాను. కానీ నువ్వు ఆ పని తప్పా మిగతా పనులన్నీ చూస్తున్నావు.. అంటాడు అమర్‌ దీంతో చంభా క్షమించండి సార్‌ నేను అప్పుడే పైకి వెళ్లాను.. నేను కింద ఉంటే ఇలా జరగనిచ్చేదాన్నే కాదు అంటుంది. దీంతో అమర్‌ కోపంగా నీకు శాలరీ ఇస్తుంది భాగీని సేఫ్‌గా  చూసుకుంటావని ఇంకొకసారి తనని వదిలి ఎటూ వెళ్లకు అని అమర్‌ చెప్పగానే.. అలాగే సార్‌ ఎటూ వెళ్లను అని చెప్తుంది చంభా..

Advertisement

అమర్‌ వెళ్లిపోయాక చంభా ఆ చూపులకు అర్థం ఏంటి అని మనోహరి అడుగుతుంది. దీంతో చంభా ఇంకా అర్థం కాలేదా..? అమ్మా మనం చెప్పింది తను నమ్మలేదు. మన మీద డౌటు వచ్చింది  అంటుంది చంభా.. అమరేంద్రకు డౌటు వచ్చిందంటే డైరెక్టుగా ఇంటరాగేషన్‌ చేస్తాడు.. ఇలా నెమ్మదిగా  ఎంక్వైరీ చేయడు అంటుంది మనోహరి.. దీంతో చంబా నువ్వు అరుందతమ్మా స్నేహితురాలివి కదా..? అందుకే నీ విషయంలో అచితూచి వ్యవహరిస్తున్నాడు. నీకు దండం పెడతాను మనోహరి కొద్ది రోజులు నువ్వు భాగీని చంపాలన్న విషయం కొద్ది రోజులు పక్కన పెట్టు.. నిన్ను చంపాలనుకున్న ఆ బ్లాక్‌మ్యాన్‌ సంగతి చూడు అని చెప్పగానే.. మనోహరి ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

Big Stories

Advertisement
×