E-Paper
Advertisement

Sriya Saran:ఆ ట్యాగ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది.. మీ ప్రేమ వెలకట్టలేనిది!

Sriya Saran:ఆ ట్యాగ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది.. మీ ప్రేమ వెలకట్టలేనిది!

Sriya Saran: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రేయ శరణ్ ఒకరు. ఒకానొక సమయంలో ఈమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతో పాటు ప్రభాస్, మహేష్ ఎన్టీఆర్ వంటి యువ హీరోలతో కూడా నటించి వెండి తెరపై సందడి చేశారు. ఇక ఇటీవల కాలంలో హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో శ్రేయ ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీలో కూడా పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న శ్రేయ తెలుగులో మాత్రం యువ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు.

సౌత్ హీరోయిన్ ట్యాగ్..

ఈ సినిమాలో ఈమె హీరో తేజ సజ్జ తల్లి పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇక శ్రేయ శరణ్ కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నప్పటికీ బి టౌన్ మీడియా మాత్రం తనని “సౌత్ హీరోయిన్” (South Heroin)అని పిలుస్తుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియచేశారు. బాలీవుడ్ మీడియా తనని అలా పిలవడం ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదని, వాళ్లు నన్ను ఎలా పిలిచినా నాకు ఏ సమస్య లేదని తెలిపారు. నిజానికి సౌత్ హీరోయిన్ అనే ట్యాగ్ తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు.

దక్షిణాది ప్రేక్షకుల ప్రేమ వెలకట్టలేనిది..

దక్షిణాది సినీ ప్రేమికులు తనపై కురిపించిన ప్రేమ వెలకట్టలేనిదని తెలిపారు. ఇక శ్రేయ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ వివిధ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. వెండితెర సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఈమె పెళ్లి చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా పాప పుట్టిన అనంతరం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన హాట్ గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటారు.

దృశ్యం 3 పనులలో బిజీగా..

ప్రస్తుతం నటి శ్రేయ సినిమాల విషయానికి వస్తే ఈమె దృశ్యం 3 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు గమనం సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా శ్రేయ నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ జన్: చంద్రయాన్ అనే సిరీస్ లో కూడా నటించారు. భాషతో సంబంధం లేకుండా వరుస భాషా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్నారు.

Also Read: Allu Sirish Nainika: ‘వావ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై కాబోయే భార్యతో అల్లు శిరీష్ ..

Related News

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

Big Stories

×