E-Paper
Advertisement

SS Rajamouli: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ, ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్: రాజమౌళి

SS Rajamouli: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ, ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్: రాజమౌళి
Advertisement

Rajamouli Request Fans For Globe Trotter: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ29. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి మరికొన్నిరోజుల్లో మహేష్ ఫస్ట్ లుక్, మూవీ టైటిల్ రానుంది. ఈ మేరకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశాడు జక్కన్న. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో నవంబర్ 15న ఈవెంట్ ని ప్లాన్ చేశారు.

రాజమౌళి వీడియో

Advertisement

ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలు అభిమానులు రానున్నారు. వేడుకను భారీ ఎత్తున్న నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సుమారు లక్షకు పైగా అభిమానులు హాజరుకానున్నారు.. అందుకే ఈ వేడుకను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారని అంటున్నారు. అయితే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి. పాస్ లేకున్న ఈవెంట్ వెళ్లొచ్చంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వారందరికి స్వయంగా జక్కన ఓ సూచన చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఆ వార్తలు నమ్మకండి

SSMB29 గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరంత ఉత్సాహం ఎదురుచూస్తున్నారని తెలుసు. నేను అంతే ఆసక్తిగా ఉన్నారు. ఈ కార్యక్రమం బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. ఈ ఈవెంట్ కి ఉన్న క్రేజ్ ని ద్రష్టిలో పెట్టుకుని పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. మనమంత తప్పకుండ వాటిని పాటించాలి. ఈ కార్యక్రమం బహిరంగంగా జరగడం లేదు. కాబట్టి పాస్ ఉన్నవారి మాత్రమే అనుమతి ఉంటుంది. పాసెస్ లేకపోయిన సరే ఈవెంట్ కి అనుమతి ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాలు ప్రచారం చేస్తున్నారు. అవి నమ్మకండి. ఆన్ లైన్ మేం పాస్ లు అమ్మడం లేదు. ఫిజికల్ పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

దయచేసి వారంత రాకండి

పాసెస్ పై క్యూ ఆర్ కోడ్ ఉంది. అది స్కాన్ చేస్తే ఈవెంట్ వేదిక వరకు ఎలా రావాలో అందులో క్లియర్ సూచించాం. దాని అధారంగా వేదకని చేరుకోండి. అలాగే 18 ఏళ్ల లోపు పిల్లలకు, సీనియర్ సిటిజన్స్ కి కూడా ఈ ఈవెంట్ కి అనుమతి లేదని పోలీసులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి వారంత ఈవెంట్ కి రావద్దని కోరుతున్నారు. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్లోనే కూర్చోని ఈ వేడుకుని చూసి ఎంజాయ్ చేయండి. ఇటీవల చోటుచేసుకున్న పలు సంఘటనల ద్రుష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధించడం జరిగింది. కాబట్టి వారి సూచనలకు మనం తప్పుకుండ పాటించాలి’ అని జక్కన్న పిలుపునిచ్చారు. అంతేకాదు ఆయా ఏరియాల నుంచి వచ్చేవారు ఈవెంట్ కి ఎలా రావాలో కూడా ఈ వీడియోలో సూచించారు.

Also Read: Akhanda 2: ‘అఖండ 2: తాండవం‘ ఫస్ట్ సింగిల్.. మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×