Akhanda 2 First Single Update: గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2 తాండవం‘. బోయపాటి శ్రీను దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైటనర్ గా వచ్చిన అఖండ మూవీకి ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2పై అంతకు మించిన బజ్ నెలకొంది. ఇందులో అఘోరగా బాలయ్య విశ్వరూపం చూపించబోతున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా మూవీ టీం భారీ ఎత్తున్న ప్లాన్ చేసింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మూవీ ఫస్ట్ సింగిల్ ని సిద్ధం చేసిన సంగతి తెలిసింది. రేపు నవంబర్ 14న విడుదలయ్యే ఫస్ట్ సింగిల్ ప్రొమోను ఇప్పటికే రిలీజ్ చేసి ఆడియన్స లో ఆసక్తి పెంచారు.
Also Read: Shiva Film శివ మూవీకి నాగార్జున, ఆర్జీవీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఇక రేపు ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ కి సంబంధించి తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ రిలీజ్ ముంబై జుహులోని పీవీఆర్ వేదికైంది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండ ముంబైలో ఫస్ట్ సింగిల్ లాంచ్ ప్లాన్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. రేపు సాయంత్రం ముంబై జుహులోని పీవీఆర్ మల్టీప్లెక్స్ లో అఖండ 2 తాండవం ఫస్ట్ సింగిల్ లాంచ్ భారీగా ప్లాన్ చేశారు మేకర్స్.తాజాగా దీనిపై మూవీ ప్రకటన ఇవ్వడంతో ఆడియన్స్ లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఫస్ట్ సింగిల్ తోనే పాన్ ఇండియా ప్రమోషన్స్ మొదలుపెట్టారని, ఇక నెక్ట్స్ టీజర్, ట్రైలర్ ఏ రేంజ్ ప్లాన్ చేసుకుంటారాని అంచనాలు వేసుకుంటున్నారు.
https://twittercom/14ReelsPlus/status/1988819131844681889
ఫస్ట్ పార్ట్ సంగీతం అందించిన తమన్ సీక్వెల్ కూడా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈసారి కూడా మళ్లీ ఓ సన్సేషనల్ ఆల్బమ్ అందించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ మూవీలోని సంగీతానికి సంబంధించి తరచూ ఏదోక అప్డేట్ వదులుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతున్నాడు. మొదటి భాగం మించి సీక్వెల్ లోనూ థియేటర్లలో బాక్సులు పేలిపోయే రేంజ్ లో మ్యూజిక్ ప్లాన్ చేశాడని అంటున్నారు. కాగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.