E-Paper
Advertisement

తప్పు చేశాను క్షమించండి.. ఇంకోసారి ఇలా జరగదు ఫాన్స్ దెబ్బకు దిగొచ్చిన కమెడియన్ రఫిక్!

తప్పు చేశాను క్షమించండి.. ఇంకోసారి ఇలా జరగదు ఫాన్స్ దెబ్బకు దిగొచ్చిన కమెడియన్ రఫిక్!
Advertisement

Stand up comedian rafiq: ఇటీవల కాలంలో కమెడియన్స్ కామెడీ పేరుతో హద్దులు దాటుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారి గురించి ఇష్టానుసారం మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సమాజంలో ఎంతో పేరు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులనే కమెడియన్స్ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా స్టాండప్ కామెడీ పేరుతో కమెడియన్స్ చేస్తున్నటువంటి అరాచకాలు మామూలుగా లేవు. ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను స్టాండప్ కమెడియన్స్ టార్గెట్ చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేశారు.

పోలీసుల అదుపులో స్టాండప్ కమెడియన్స్..

ఇలా వరుసగా కమెడియన్స్ పవన్ కళ్యాణ్ పట్ల విమర్శలు కురిపించడంతో ఇది కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఇప్పటికే పలువు రు అభిమాన సంఘాలు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనుదీప్ అనే కమెడియన్ ను అరెస్టు చేయడంతో ఈయన ఒక రోజు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు.

పవన్ గురించి తప్పుగా మాట్లాడాను..

Advertisement

అనుదీప్ బాటలోనే మరొక కమెడియన్ రఫిక్ సైతం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు తన పెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ ను తన ముగ్గురు భార్యలు వదిలేసారంటూ ఈయన తన పెళ్లి, విడాకుల గురించి మాట్లాడటంతో పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాఫిక్ పై ఫిర్యాదులు చేశారు. దీంతో మచిలీపట్నం పోలీసులు మహమ్మద్ రఫీక్ ను కూడా వైజాగ్ లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టు అనంతరం రఫిక్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు తెలియజేశారు. తాను పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి అలా మాట్లాడి ఉండకూడదని, అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

Advertisement

ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు. కేవలం పవన్ కళ్యాణ్ విషయంలోనే కాదు ఎవరి విషయంలో కూడా ఇలాంటి తప్పు చేయనని ఈయన పవన్ తో పాటు ఆయన అభిమానులకు కూడా బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు స్టాండప్ కమెడియన్స్ ను అరెస్టు చేయడంతో ఇకపై ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడదని అభిమానులు భావిస్తున్నారు. కామెడీ చేయడం తప్పు కాదు కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధంగా కామెడీ చేయటం సరైనదికాదని చెప్పాలి అయితే వరుసగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంతో వీరి విమర్శల వెనుక ఎవరి హస్తమైనా ఉందా? ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారా? అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నాస్తికత్వం అంటే దేవుడిని ఎగతాళి చేయటం కాదు.. ప్రకాష్ రాజ్ కు నాగబాబు కౌంటర్!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×