E-Paper
Advertisement

డేంజరస్ డేటింగ్ యాప్స్.. క్యూట్ అమ్మాయిలతో వల.. దొరికారో తాట తీసేస్తారు!

డేంజరస్ డేటింగ్ యాప్స్.. క్యూట్ అమ్మాయిలతో వల.. దొరికారో తాట తీసేస్తారు!
Advertisement

Dating App Scams: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సైబర్ నేరస్తులు.. ఫ్రెండ్ షిప్, డేటింగ్ యాప్స్ పేరుతో యువతకు వల విసురుతున్నారు. ఒంటరి యువకులను లక్ష్యంగా చేసుకొని అందమైన అమ్మాయిల పేరుతో నిలువునా దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్స్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

అసలేంటి ఈ డేటింగ్ యాప్ స్కామ్?

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న సమయంలో డేటింగ్ యాప్స్ పేరుతో కొన్ని ప్రకటనలను చూసే ఉంటారు. ఓ అందమైన అమ్మాయితో స్నేహం లేదా డేటింగ్ చేయాలంటే ఈ యాప్ మీ దగ్గర ఉండాల్సిందే? అంటూ ఆ ప్రకటనలు ఊదరగొడుతుంటాయి. ఏమాత్రం కక్కుర్తి పడి వారు సూచించిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారో.. అక్కడి నుంచే అసలైన స్కామ్ మెుదలవుతుంది.

మోసం ఎలా చేస్తారంటే?

Advertisement

ఫ్రెండ్ షిప్ లేదా డేటింగ్ యాప్ ను ఉపయోగించి.. అమ్మాయితో మాట్లాడాలంటే నిర్ధిష్ట సమయానికి రూ.16-50 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించగానే అవతలివైపు నుంచి ఒక అందమైన ప్రొఫైల్ తో యువతి మీతో చాటింగ్ చేయడం ప్రారంభిస్తుంది. మీ కోరికలను రెచ్చగొట్టే విధంగా ఆమె మెసేజ్ లు ఉంటాయి. తర్వాతి స్టెప్ లో భాగంగా మీతో ఆన్ లైన్ కాల్ ఆమె మాట్లాడుతుంది. లేడీస్ వాయిస్ తో అవతలి నుంచి మాట్లాడుతూ మీతో మాట్లాడేది అమ్మాయే అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది.

నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్..

ఫోన్ కాల్ ద్వారా వ్యక్తిగత విషయాలు అన్ని సేకరించిన అనంతరం.. అవతలి వైపు అమ్మాయి వీడియో కాల్ ను ఆఫర్ చేస్తుంది. మీరు ఏ మాత్రం ఈ విషయంలో తొందరపడినా.. తిరిగి వెనక్కిరాలేనంత ఇబ్బందుల్లోకి వెళ్లిపోతారు. మీరు చేసిన నగ్న వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి.. మిమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేస్తారు. అప్పటికే యాప్ డౌన్ లోడ్ సందర్భంగా మీరు ఇచ్చిన అన్ని పర్మిషన్లతో మీ ఫోన్ లోని కాంటాక్ట్ నెంబర్లకు వారికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో మీ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు షేర్ చేస్తామని బెదిరించడం మెుదలుపెడతారు. ఇలా వారి ఉచ్చులో చిక్కుకొని యువత డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలో ఇటీవల బాగా పెరిగిపోయాయి.

Advertisement

Also Read: తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే.. మీరేం ప్రశ్నించరా? బీజేపీ ఎంపీలపై హరీశ్ రావు ఫైర్

సజ్జనార్ అలర్ట్..

డేటింగ్ యాప్స్ పేరిట జరుగుతున్న ఈ మోసాలపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్.. గత నెలలో యువతను అప్రమత్తం చేశారు. రాత్రిపూట అందమైన అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడండి అంటూ వస్తున్న ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలా మాట్లాడేవారు నిజమైన మహిళలు కాదని వెల్లడించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి మహిళలు మాట్లాడుతున్నట్లుగా వీడియోలు చేసి.. యువతను బుట్టలో వేస్తున్నారని, తద్వారా డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

Also Read: Meta layoffs: మెటా షాకింగ్ నిర్ణయం.. ఒక్కరోజులో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు..!

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×