E-Paper
Advertisement

కమల్ హాసన్ రజినీ కాంత్ విలన్ గా స్టార్ డైరెక్టర్… ఇదేమీ ట్విస్టు భయ్యా?

కమల్ హాసన్ రజినీ కాంత్ విలన్ గా స్టార్ డైరెక్టర్… ఇదేమీ ట్విస్టు భయ్యా?
Advertisement

Kamal Rajini Movie: ఇటీవల కాలంలో ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటులుగా మారి వెండి తెరపై ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరి కొంతమంది హీరోలు మెగా ఫోన్ పట్టుకొని యాక్షన్ కెమెరా అంటూ డైరెక్టర్లుగా మారిపోయారు. అయితే త్వరలోనే మరొక స్టార్ డైరెక్టర్ సైతం వెండి తెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో దర్శకుడు శంకర(Shankar) ఒకరు. జెంటిల్ మెన్, భారతీయుడు రోబో, శివాజీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శంకర్ ఇటీవల బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు.

వరుస డిజాస్టర్ సినిమాలతో శంకర్..

ఇటీవల ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2,గేమ్ చేంజర్ లాంటి సినిమాలు పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలోనే శంకర్ అవకాశాలను కూడా అందుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈయన వెండి తెరపై సందడి చేయబోతున్నట్టు సమాచారం. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటులు కమల్ హాసన్ రజనీకాంత్ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోని కూడా విడుదల చేశారు.

కమల్ హాసన్ రజినీకాంత్ మల్టీ స్టారర్ …

Advertisement

ఇలా కమల్ హాసన్ రజినీకాంత్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు శిబి చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక వీడియో విడుదల చేయగా సినిమా పట్ల భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో ఇద్దరి హీరోలతో పోటీ పడటం కోసం డైరెక్టర్ శంకర్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం డైరెక్టర్ శిబి చక్రవర్తి శంకర్ ను సంప్రదించారట. ఇక డైరెక్టర్ శంకర్ సైతం విలన్ పాత్రలో వెండితెరపై సందడి చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.

విలన్ పాత్రలో శంకర్..

Advertisement

ఇలా తెర వెనుక ఉంటూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన శంకర్ తెరపై మొదటిసారి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కమల్ రజనీకాంత్ సినిమాలో శంకర్ విలన్ గా నటించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నారు. ఇక రజనీకాంత్ సైతం ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే.

Also Read: బాలకృష్ణతో సినిమా… ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న కొరటాల శివ?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×