E-Paper
Advertisement

బాలకృష్ణతో సినిమా… ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న కొరటాల శివ?

బాలకృష్ణతో సినిమా… ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న కొరటాల శివ?
Advertisement

NBK 112: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. బాలకృష్ణకు అనుగుణంగా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ ఇతర సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే . ఈయన తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నట్టు సమాచారం.

మే 1 న పూజా కార్యక్రమం..

కొరటాల శివ బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా NBK 112 సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ బాలకృష్ణకు అద్భుతమైన కథను సిద్ధం చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా మే 1వ తేదీ పూజ కార్యక్రమాలను జరుపుకొని జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాకు అన్ని సిద్ధమయ్యాయి కానీ ఒక సంగీత దర్శకుడు విషయంలో మాత్రం కొరటాల శివ ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తుంది.

కొరటాల దేవిశ్రీ హిట్ కాంబో..

Advertisement

కొరటాల శివ సినిమాల విషయానికి వస్తే ఈయన డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు అన్నింటికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మిర్చి, జనతా గ్యారేజ్ ,శ్రీమంతుడు సినిమాలకు దేవిశ్రీ అద్భుతమైన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆచార్య సినిమాకి మాత్రం మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా కొరటాల సినీ కెరియర్ లోనే డిజాస్టర్ సినిమాగా నిలిచింది. అనంతరం ఎన్టీఆర్ తో కలిసి చేసిన దేవర సినిమాకు అనిరుద్ రంగంలోకి దిగారు. ఇక బాలకృష్ణ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంపై కొరటాల ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తుంది.

ఎల్లమ్మ పనులలో బిజీగా దేవిశ్రీ..

Advertisement

ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోవడానికి ఆయన ప్రస్తుతం హీరోగా మారి ఎల్లమ్మ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.తమన్ విషయానికి వస్తే తమన్ మ్యూజిక్ పై ఇటీవల భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో తమన్ ను తీసుకోవాలనే ఆలోచనలో కూడా కొరటాల లేరని తెలుస్తోంది. ఇక అనిరుద్ ఫాస్ట్ కంపోజర్ కాదు.ఈయన సినిమాలకు చాలా సమయం తీసుకుంటారు. కొరటాల టార్గెట్ ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు దీంతో అనిరుద్ ను తీసుకుంటే అది సాధ్యం కాని పని అవుతుంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంలో కొరటాల శివ ఆలోచనలో పడ్డారని ఈ సినిమాకు సంగీత దర్శకుడు సమస్యగా మారారని తెలుస్తోంది . మరి బాలకృష్ణ సినిమాకు ఏ సంగీత దర్శకుడిని రంగంలోకి దింపబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: అక్షయ్ కుమార్ కూతురికీ వేదింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు!

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×