E-Paper
Advertisement

డెకాయిట్ సినిమాలో స్టార్ హీరో మేనకోడలు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

డెకాయిట్ సినిమాలో స్టార్ హీరో మేనకోడలు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Advertisement

Decoit Movie:ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలామంది చిన్నచూపు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పైగా బాలీవుడ్ లో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇచ్చింది కూడా చాలా తక్కువే. కానీ రాజమౌళి, సుకుమార్ లాంటి కొంతమంది దిగ్గజ దర్శకుల పుణ్యమా అని ఇప్పుడు తెలుగు చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అందుకే తెలుగు చిత్రాలలో నటించడానికి బాలీవుడ్ మాత్రమే కాదు ఏకంగా హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు చిత్రంలో ఒక బాలీవుడ్ స్టార్ హీరో మేనకోడలు కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఈవెంట్లలో సందడి చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆమె ఎవరు? ఆ స్టార్ హీరో ఎవరు? ఇప్పుడు ఆమె నటిస్తున్న చిత్రం ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

డెకాయిట్ సినిమాలో అమీర్ ఖాన్ మేడ కోడలు..

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) మేనకోడలు జేయన్ మేరీ ఖాన్(Zayn marie khan).. తాజాగా ఈమె అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షానిల్ డియో దర్శకత్వంలో వస్తున్న లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి , సునీల్, కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Advertisement

ఈ నేపథ్యంలోనే డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. చక్కని చీరకట్టులో కనిపించి ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. దీంతో ఈమె ఎవరు అని అందరూ ఆరా తీయగా.. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) మేనకోడలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ (Mansoor Khan) కూతురైన ఈమె ఇప్పటికే హిందీ పరిశ్రమలో పలు చిత్రాలు చేస్తూ నటిగా రాణిస్తోంది. ఇక ఇప్పుడు డెకాయిట్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించనుంది. మరి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

ALSO READ:పెద్ది మూవీ నైజాం రైట్స్.. దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన మైత్రి.. అసలేమైందంటే?

జేయన్ మేరీ ఖాన్ సినిమా కెరియర్!

Advertisement

జేయన్ మేరీ ఖాన్ కెరియర్ విషయానికి వస్తే.. కపూర్ అండ్ సన్స్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈమె.. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ రూపొందించిన ‘మిస్ సీరియల్ కిల్లర్’ సినిమాతో ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఓ మై డార్లింగ్ మేడ్ ఇన్ హెవెన్, ఇల్లీగల్ :జస్టిస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ వంటి చిత్రాలలో తళుక్కుమని మెరిసిన ఈమె.. ఫీల్స్ లైక్ ఇష్క్ వెబ్ సిరీస్ తోపాటు మరికొన్ని వెబ్ సిరీస్ లలో వివిధ పాత్రలు పోషించి బాలీవుడ్ ఆడియన్స్ కు ఫేవరెట్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక అలా బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా డెకాయిట్ చిత్రంతో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. పైగా ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో కూడా జేయన్ కు సంబంధించిన స్టిల్స్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×