E-Paper
Advertisement

RCB, CSK మ‌ధ్య సాంబార్ చిచ్చుపెట్టిన జొమాటో…త‌మిళ‌నాడులో బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు !

RCB, CSK మ‌ధ్య సాంబార్ చిచ్చుపెట్టిన జొమాటో…త‌మిళ‌నాడులో బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు !
Advertisement

Ban On Zomato:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament
) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Chennai Super Kings ) మధ్య ఆదివారం బిగ్ ఫైట్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో RCB బంపర్ విక్టరీ నమోదు చేసింది. అయితే ఈ విజయం తర్వాత బెంగళూరు అలాగే చెన్నై అభిమానుల మధ్య సాంబారు చిచ్చు పెట్టింది జొమాటో. చెన్నై ఇడ్లీ సాంబార్ ( sambar) కంటే బెంగళూరు సాంబార్ అద్భుతంగా ఉందని అర్థం వచ్చేలా ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టింది జొమాటో ( zomato). దీంతో జొమాటోను బ్యాన్ చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే జొమాటో యాప్ ను డిలీట్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

RCB, CSK మ‌ధ్య సాంబార్ చిచ్చుపెట్టిన జొమాటో

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. నిన్న చెన్నై వర్సెస్ బెంగళూరు మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగితే, CSK చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో చెన్నైని ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు జనాలు. అటు సీఎస్కే అభిమానులకు సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపిస్తున్నారు బెంగళూరు అభిమానులు. దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పరువు తీస్తూ జోమాటో సాంబార్ పంచాయతీ పెట్టింది. ఆదివారం రోజున మ్యాచ్ పూర్తయిన వెంటనే, చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబార్ అద్భుతం అంటూ జొమాటో పోస్ట్ పెట్టి పెంట పెంట చేసింది. దీంతో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. వెంటనే తమిళనాడు రాష్ట్రంలో జొమాటోను బ్యాన్ చేయాలని కోరుతున్నారు. అంతేకాదు జొమాటో యాప్ ను డిలీట్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన జనాలందరూ ఈ యాప్ వాడకూడదని.. వెంటనే యూనిస్టాల్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో జొమాటో ఆర్డర్స్ అమాంతం పడిపోయాయి. బెంగళూరు జట్టుకు అనుకూలంగా పోస్ట్ పెట్టినందుకు ఈ వివాదం రాజుకుంది.

బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయిన చెన్నై

Advertisement

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు చేతిలో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో బెంగుళూరు 250 పరుగులు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. దీంతో చెన్నై పై 43 పరుగుల తేడాతో పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది బెంగుళూరు.

 

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×