E-Paper
Advertisement

Travel Spots: ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న భారతీయ ప్రదేశాలు ఇవి, వేసవి సెలవుల్లో చూసేయండి

Travel Spots: ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న భారతీయ ప్రదేశాలు ఇవి, వేసవి సెలవుల్లో చూసేయండి
Advertisement

భారత్‌ అంటేనే చరిత్ర, సంస్కృతి, కళల సమ్మేళనం. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించింది. ప్రస్తుతం భారత్‌లో 40కి పైగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఇవి కేవలం భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.

తాజ్ మహల్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ప్రేమకు ప్రతీకగా నిలిచింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోని అత్యంత అందమైన నిర్మాణాల్లో ఒకటి. తెల్లటి మార్బుల్ రాయితో నిర్మించిన ఈ సమాధి ఉదయం, సాయంత్రం సమయంలో మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే ప్రతి ఏడాది లక్షలాది మంది విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

Advertisement

Also read: Things gives debt: ఈ 5 వస్తువులు ఇతరులకు మీ చేత్తో ఇవ్వకండి, అప్పుల పాలవుతారు

అజంతా గుహలు
మహారాష్ట్రలో ఉన్న అజంతా గుహలు బౌద్ధ కళకు అద్భుత నిదర్శనం. ఈ గుహల్లో కనిపించే చిత్రాలు, శిల్పాలు ఎంతో పురాతనమైనవి. బుద్ధుడి జీవితానికి సంబంధించిన కథలను చిత్రాల రూపంలో చూపించడం ఈ గుహల ప్రత్యేకత. చరిత్రకారులు తప్పక సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి.

Advertisement

హంపి
కర్ణాటకలోని హంపి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రస్తుతం అక్కడ కనిపించే అవశేషాలు ఆ సామ్రాజ్య వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి. పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఉన్న ఆలయాలు, రథాలు, గోపురాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హంపి ప్రదేశం ప్రకృతి అందాలతో కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది.

Also read: Slippers: ఇంటి ముందు చెప్పులు చిందరవందరగా పడేస్తున్నారా? అయితే జరిగేది ఇదే

కోణార్క్ సూర్య దేవాలయం
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం సూర్యుడి రథంలా నిర్మించారు. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించారు. రథ చక్రాలు, గుర్రాలు వంటి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. భారతీయ శిల్పకళలో ఇది ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది.

ఖజురాహో దేవాలయాలు
మధ్యప్రదేశ్‌లోని ఖజురాహో దేవాలయాలు తమ ప్రత్యేక శిల్పకళతో ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఈ ఆలయాల్లోని శిల్పాలు మానవ జీవితం, సంస్కృతి, భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ఈ ప్రత్యేకత వల్లే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

ఎల్లోరా గుహలు
ఎల్లోరా గుహలు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన మతాల సమ్మేళనంగా కనిపిస్తాయి. రాతిలో చెక్కిన కైలాస నాథ దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఒకే రాయిని చెక్కి నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే అరుదైన కట్టడంగా గుర్తింపు పొందింది.

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×