E-Paper
Advertisement

Stranger Things: వినోదంతో పాటు ఆదాయం, ఉద్యోగాలు కూడా.. ఎలాగో తెలిస్తే షాక్!

Stranger Things: వినోదంతో పాటు ఆదాయం, ఉద్యోగాలు కూడా.. ఎలాగో తెలిస్తే షాక్!

Stranger Things:స్ట్రేంజర్ థింగ్స్.. ఈ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగించిన ఈ సీరీస్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ లో ఒక సాంస్కృతిక సంచలనంగా మారిన ఈ సిరీస్.. ఇప్పటివరకు సుమారుగా 120 కోట్లకు పైగా వ్యూస్ ను రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించినట్లు నివేదికలు చెబుతున్నాయి.. అంతేకాదు ఈ స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ వినోదంతో పాటు భారీ ఆదాయాన్ని అందించడమే కాకుండా చాలామందికి ఉద్యోగాలు కూడా కల్పించింది. అది ఎలాగో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోకమానరు.

వినోదంతో పాటు ఆదాయం, ఉద్యోగాలు కూడా..

దాదాపు పది సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ వినోదంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఆదాయాన్ని అందించింది. 2016 నుంచి ఇప్పటివరకు ఈ షో సుమారుగా అమెరికా జీడీపీకి 1.4 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని అందించింది. అంతేకాదు 2016 నుండి ఇప్పటివరకు సుమారుగా ఈ షో 8వేల మందికి ఉద్యోగాలను సృష్టించింది.. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సీరీస్ చిత్రీకరణ జరిగిన జార్జియా రాష్ట్రంలో పర్యాటక రంగం కూడా కళకళలాడిపోయింది. స్ట్రేంజర్ థింగ్స్ లో చూపించిన ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు కూడా ఎగబడ్డారు. దాంతో ఆదాయం భారీగా పెరిగింది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతం ద్వారా అక్కడ సుమారుగా 650 మిలియన్ డాలర్ల ఆదాయం లభించడం విశేషం.

వ్యాపార సామ్రాజ్యంలో కూడా సంచలనం సృష్టించిన స్ట్రేంజర్ థింగ్స్..

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ అనేక వ్యాపారాల అభివృద్ధికి కూడా దోహద పడింది. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ లోని ప్రధాన పాత్రలైన ఎలెవన్ కు ఎగ్గోస్ వాఫెల్స్ అంటే ఎంతో ఇష్టం. సిరీస్ సీజన్ 1,2 లో ఈ విషయాన్ని చాలా బాగా చూపించారు. అప్పటినుంచి ఈ వాఫెల్స్ అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 2017లో కెల్లాగ్స్ కంపెనీ అమ్మకాల్లో ఏకంగా 14% వృద్ధి నమోదయింది. ముఖ్యంగా ఇందులో పిల్లలు ఆడే డేంజియన్స్ అండ్ డ్రాగన్స్ బోర్డ్ గేమ్ పట్ల ఆసక్తి 673 శాతం పెరగడంతో అమ్మకాలు కూడా భారీగానే పెరిగిపోయాయి.

ALSO READ:Tollywood: కుర్చీతాత బ్రతికే ఉన్నారా? లేక చంపేశారా?

సీజన్ 5 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇకపోతే స్ట్రేంజర్ థింగ్స్ ఆఖరి ఎపిసోడ్ సీజన్ 5 వాల్యూమ్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భారత కాలమాన ప్రకారం డిసెంబర్ 26 శుక్రవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వస్తోంది. ది రైట్ సైడ్ అప్ అనే పేరుతో రానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిడివి ఏకంగా రెండు గంటల 8 నిమిషాలు ఉండగా.. ఇది భారత కాలమాన ప్రకారం జనవరి 1 ఉదయం 6:30 గంటలకు నెట్ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రానుంది. అంతేకాదు అమెరికాలో ఫినాలే కోసం ఏకంగా 500కు పైగా థియేటర్లలో దీనిని ప్రదర్శించనున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఈ ఒక్క సిరీస్ భారీ సంచలనం సృష్టించింది.

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×