Podarillu Today Episode December 25th : భూషణ్ ప్రవర్తన తెలుసుకున్న మహా అతని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని ఫిక్స్ అయిపోతుంది.. మహా ఇలా చేస్తుంది అని ఆది ప్రతాప్ కి ఫోన్ చేసి చెప్తాడు.. మహాకే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు ప్రతాప్. మహాతో మాట్లాడుతున్న సమయంలో ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి వారిని చంపేయండి అని సీరియస్ అవుతాడు. ఇక మహా కూడా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతుంది. భూషణ్ మహాను కూడా పిలవండి అని అంటారు. పెళ్లయి వీసా వచ్చేలోగా చాలా టైం పడుతుంది. అందుకే నేను వీసా కోసం ట్రై చేయాలి కదా అంకుల్.. ముందుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఈ పనులన్నీ పూర్తి అవుతాయి అని అంటాడు. మీరు ఏమంటారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మేలు కదా అని భూషణ్ అంటాడు. ఆ మాట వినగానే మహా నాకు ఈ పెళ్లి ఇప్పుడే ఇష్టం లేదు ఇంత సడన్గా చెప్తే ఎలా అంటుంది.. చక్రీ మహా ఒంటరిగా దొరికితే పులిహోర కలిపే ప్రయత్నం చేస్తాడు. కానీ మహా చక్రిని మాత్రం తన సొంత మనిషి లాగా చూస్తుంది.. తనకి భోజనం తెచ్చి పెడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాను ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది.. మరి నాకు భోజనం పెడతారా? లేదా తినేసి రమ్మంటారా? ఎందుకంటే నేను ఆకలికి ఆకలేను అని అడుగుతాడు.. ఇంకా భోజనం చేయలేదా అని మహా అడుగుతుంది.. చేయలేదు కాబట్టే బయటకు వెళ్లి తినేసి రమ్మంటారా అని అడిగాను అని చక్రి అంటాడు. చక్రి కోసం మహా భోజనం తెచ్చి ఇస్తుంది. చక్రి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులను జరగదు మీరేం బాధపడకండి అని ధైర్యం చెప్తాడు.. నా పెళ్లి ఆపడానికి నువ్వెవరు మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అని మహా అంటుంది.. మీరు అవన్నీ వదిలేసేయండి నేను చూసుకుంటాను కదా అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహాను గుడికి తీసుకెళ్లాలని హారిక అక్కడికి వస్తుంది. ఇక్కడ నా మనసుని ఎవరు అర్థం చేసుకోవట్లేదు కనీసం గుడికి అయిన వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది అని అంటుంది..
చక్రి మహాదర్శనం ఇవాళ దొరుకుతుందో లేదో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రతాప్ దగ్గరికి వచ్చిన మహా హారిక ఇద్దరు కూడా గుడికి వెళ్తాము అని అంటారు. ప్రతాప్ చక్రీని పిలిచి నా కోడలు కూతురు ఇద్దరు గుడికి వెళ్లాలని అనుకుంటున్నారు జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకురా అనేసి చక్రితో చెప్తారు. సరే సార్ నేను వెళ్తాను అని చక్రి అంటాడు. ఆ మేడం గారు కోపంగా ఉన్నా కూడా ఇవాళ చాలా బాగా ఉన్నారు మేడం అని చూసి మురిసిపోతూ ఉంటాడు.. ఇక మహాకి ఎలాగైనా సరే తన ప్రేమ విషయాన్ని ఇవాళ బయట పెట్టాలి అని అనుకుంటాడు..
కన్నా మాధవ్ ని కాలేజీకి తీసుకెళ్లడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చేసావ్ రా నన్ను తీసుకు రమ్మన్నారు అంటే నువ్వు ఏం చేసావో అని నాకు కంగారుగా ఉంది అని మాధవ్ అంటాడు. కానీ మాధవ్ భయపడుతూ ఉంటే కన్నా మాత్రం ఏం లేదన్నా ఊరికే పిలిచారు ఎలా ఉంది ఏంటి అని చెప్తారు అంతే అని ధైర్యం చెబుతూ ఉంటాడు. కానీ మాధవ్ మాత్రం నాకు ఏదో టెన్షన్ గా ఉందిరా అని వెళుతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ ఎదురుగా వచ్చి అరే ప్రిన్సిపల్ చాలా కోపంగా ఉన్నారు రా.. నువ్వు వెళ్ళు లోపలికి తెలుస్తుంది అని అంటాడు. లోపలికి వెళ్ళగానే ప్రిన్సిపల్ తల్లిదండ్రులు తీసుకురమ్మంటే అన్నయ్యని తీసుకొచ్చావ్ ఏంటి అని కన్నా పై సీరియస్ అవుతారు..
మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది సార్ మా నాన్న ఏ లోకంలో ఉంటాడు అతనికి తెలీదు. చిన్నప్పటి నుంచి వీడిని పెంచింది నేనే చెప్పండి సార్ ఏమైందో అని అంటాడు.. మీ అబ్బాయి ఒక అతని క్రికెట్ స్టంప్స్ తో దారుణంగా కొట్టాడు అని అనగానే మాధవ షాక్ అవుతాడు. ఏంటి సార్ మీరు మాట్లాడేది అని మాధవ్ లేస్తాడు. అని ప్రిన్సిపల్ మీరు లేచారు సరే ఆ వ్యక్తి మాత్రం కూర్చోవడానికి వీలు లేనంతగా బాధపడుతున్నాడు. మీ తమ్ముడు ఒక రౌడీ లాగా ప్రవర్తించడు రౌడీలకి మా కాలేజీలో సీటు ఉండదు అతని బయటికి పంపించేస్తున్నాము అని అంటారు.. ఆ మాట వినగానే మాధవ్ భయపడతాడు. అలా అనకండి సార్ మా తమ్ముడు జీవితం నాశనం అయిపోతుంది ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని మాధవ్ ప్రిన్సిపాల్ తో అంటాడు.
బయటకు రాగానే కన్నా పై సీరియస్ గా ఉంటాడు మాధవ్.. నేనేం చేయలేదన్నయ్యా వాడు క్రికెట్ ఆడడానికి వెళ్తే పెళ్లి తాపీ పని చేసుకోకుండా క్రికెట్ ఆడటానికి వచ్చావా అని నిన్ను అన్నాడు దానితోని నేను వాడిని కొట్టాను అన్నయ్య అని అనగానే మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. చాలా డబ్బున్నవాడు అన్నయ్య మనల్ని అనడంతోనే నేను అలా పని కొట్టాను అని అంటాడు మాధవ్ నువ్వు ఎప్పుడు ఇలాంటివి చెయ్యకురా ఎవరేమన్నా సమాధానం చెప్పకుండా నువ్వు మంచి స్థాయిలోకి రావాలి అని అంటాడు. అలాగే అన్నయ్య నేను ఎప్పుడూ ఇంకా ఎవరి జోలికి వెళ్ళను అని మాధవ్ కు కన్నా మాటిస్తాడు..
హారిక అలాగే మహా ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు.. గుడిలో ప్రదక్షిణాలు చేయమని హారిక మహా కి చెప్తుంది.. కానీ మహా మాత్రం నాకు అంత ఓపిక లేదు. నువ్వు వెళ్లి ప్రదక్షిణాలు చేయు నేను పూజకు వస్తాను అని చెప్పగానే హారిక నాకు అర్థమైంది.. నువ్వు వెళ్ళు అన్ని సిద్ధం చేసి పూజ జరిగే టైం లో నేను పిలుస్తానని అంటుంది.. బయటకు వెళ్లిన మహా చక్రి దగ్గర కూర్చుంటుంది. ఏమైంది మేడం పూజ అయిపోయిందా వెళ్ళిపోదామని అడుగుతాడు. ఏంటి వీడు ఎప్పుడైనా గుడికి వెళ్ళాడా అని అట్లా చూస్తున్నారేంటి మేడం అని చక్రి అడుగుతాడు.. నిజమే మేడం నేను గుడికి వెళ్ళలేదు గుడి వరకు అందర్నీ డ్రాప్ చేసి వస్తాను అని అంటాడు.
అయితే మీరు చిలకలాంటివారు పంజరంలో పెట్టి కెనడాకు పంపిస్తున్నారు అంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. మీరు నిజంగా ఆలోచించాలి ఈ విషయం గురించి అని మహాకూ కళ్ళు తెరిపించే స్టోరీ చెప్తాడు చక్రి. మీ పెళ్లి సంబంధం నేను ఎలాగైనా చెడగొడతాను అని చెప్పాను కదా మీరేం కంగారు పడకండి అని అంటాడు.. చక్రీ చెప్పిన మాటలను మహా ఆలోచిస్తూ ఉంటుంది.. మహాని హారిక పిలవడంతో లోపలికి వెళ్ళిపోతుంది. చక్రి మహా గురించి మాధవ్ కి చెప్తాడు.. ఆ పెళ్లిని మనం ఆపేయాలి అన్నయ్య అని చెప్పగానే మాధవ్ షాక్ అవుతాడు..
అసలు మనమేం చేయగలం రా ఏం మాట్లాడుతున్నావ్ రా కొంచమైనా బుద్ధి ఉందా నీకు అని మాధవ్ అంటాడు.. ఆడపిల్ల పెళ్లి ఆపాలనుకోవడం పాపం రా నీకు తెలీదు నువ్వు నోరు మూసుకొని ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. చక్రి ఎంత చెప్తున్నా సరే మాధవ్ వినడు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది నేను ఈ విషయాన్ని ఎలా వదిలేస్తాను అన్నయ్య అని చక్రి అంటాడు. ఆ మాట వినగానే మాధవ్ నువ్వు నోరు మూసుకొని లేనిపోని గొడవల్లో ఇరుక్కోకుండా వచ్చేసేయ్ అని అంటాడు. నువ్వు భయపడుతూనే ఉంటావు నేను కేశవ్ కి ఫోన్ చేసి వారిని రమ్మని చెప్తాను అని చక్రి ఫోన్ పెట్టేస్తాడు.
Also Read : భాగ్యం ప్లాన్ సక్సెస్.. ప్రేమ, ధీరజ్ బిగ్ ఫైట్.. విశ్వం ప్లాన్ సక్సెస్.. నెక్స్ట్ ఇదే..?
అన్నయ్య ఇలానే అంటాడు.. కేశవ్ కు చెప్తే వాడే కరెక్టు అని చక్రీ అనుకుంటాడు.. కేశవకు ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్తాడు చక్రీ.. అసలు అందరికీ భయం లేకుండా పోతుంది నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పోతున్నారు అని మాధవ్ అంటాడు. ఏంట్రా నువ్వు ఇంత తొందరగా వచ్చావు అని కేశవ్ అని మాధవ్ అడుగుతాడు. చక్రీ ఫోన్ చేశాడు అనగానే మాధవ్ షాక్ అవుతాడు.. కేశవ్ మాత్రం వాడు వాడి జీవితంలో మంచి పని చేస్తున్నాడు హెల్ప్ చేయడం తప్పులేదు కదా అని మాధవతో అంటాడు. ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటే వాడు ఆపాలని అనుకుంటున్నాడు అది తప్పు కాదు కదా అన్నయ్య అని కేశవ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..