E-Paper
Advertisement

Tollywood: కుర్చీతాత బ్రతికే ఉన్నారా? లేక చంపేశారా?

Tollywood: కుర్చీతాత బ్రతికే ఉన్నారా? లేక చంపేశారా?
Advertisement

Tollywood: ఒక్క డైలాగ్ తో భారీ పాపులారిటీ సంపాదించుకొని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసారు ఒక ముసలాయన. గతంలో హైదరాబాద్ లోని కృష్ణానగర్ పరిసర ప్రాంతాలలో బిచ్చమెత్తుకుంటూ కనిపించిన ఈయన.. ఒక ఇంటర్వ్యూలో “కుర్చీ మడతపెట్టి ” అనే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ డైలాగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాను మ్యూజిక్ అందించిన ‘గుంటూరు కారం’ సినిమా కోసం ఉపయోగించుకోవడంతో ఈ పాట ద్వారా ఆ తాతకు మరింత క్రేజ్ లభించింది. ఇకపోతే తమన్ ఈ డైలాగును ఉపయోగించుకున్నందుకుగాను సదరు కుర్చీ తాతకు డబ్బులు కూడా ఇచ్చారు. అలా యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఈయన.. ఇక్కడ గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి అనే పాటతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.

కుర్చీతాత చనిపోయారా?

అలా భారీ పాపులారిటీ అయిన ఆయన సడన్ గా చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన కుర్చీ తాత చనిపోయాడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, రెస్ట్ ఇన్ పీస్ తాత అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ లో కుర్చీ తాత చనిపోయాడనే వార్తలు రావడంతోనే సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ పోస్టులు చూసిన చాలామంది నిజంగానే ఆయన చనిపోయాడని.. ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిన కుర్చీ తాత మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పోస్టర్లు కూడా వేస్తూ ఉండడం గమనార్హం.

వీడియో రిలీజ్ చేసిన వైజాగ్ సత్య..

Advertisement

అలా ఈ వార్తలు సోషల్ మీడియాలో దావాణంలా పాకిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వైజాగ్ సత్య స్పందించారు.. “గాంధీ హాస్పిటల్లో చనిపోయింది కుర్చీ తాత కాదు. ప్రస్తుతం ఆయన వరంగల్లోనే ఉన్నాడు. ఆయనకు చెల్లి కానీ, కూతురు కానీ గుర్తొచ్చిన ప్రతిసారీ ఇలాగే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చారు. ఈసారి కూడా అలాగే వెళ్లిపోయారు. కానీ ఆయన వరంగల్లో బ్రతికే ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటాడు. దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి. కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి అంటూ కుర్చీ తాత భార్యతో కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు వైజాగ్ సత్య.

 

ఫేక్ న్యూస్ రావడానికి కారణం?

Advertisement

మేడ్చల్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక డెడ్ బాడీ ఉందని.. అది కుర్చీ తాత దే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ సత్య వీడియో రిలీజ్ చేయడం జరిగింది..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×