E-Paper
Advertisement

ఘనంగా తరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో.. ముఖ్య అతిథులు వీరే!

ఘనంగా తరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో.. ముఖ్య అతిథులు వీరే!
Advertisement

Film industry: తాజాగా శుక్రవారం అనగా 2026 మే 8వ తేదీన హైదరాబాద్లోని సిటాడెల్ హోటల్ వేదికగా వా ది ఓజీఎస్ తరరంపం సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ , వ్యాపారవేత్తలు హాజరయ్యారు . ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి, చేతన్ భరద్వాజ్, సినిమా దర్శకుడు జ్ఞాన శేకర్ లతో పాటు సింగర్స్ శ్రీకృష్ణ , సెలబ్రిటీ లైఫ్ స్టైల్ గురు తదితరులు హాజరైన ఈ కార్యక్రమం నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండపర్తి మార్గదర్శకత్వం అలాగే మెంటార్ షిప్ లో జరిగింది.

సెలబ్రిటీ అంత్యాక్షరి షో ఎప్పుడు? ఎక్కడ?

ఈ మహా సంగీత వినోద వేడుక తెలుగు ఎంటర్టైన్మెంట్ చరిత్రలో ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు కొత్త ప్రామాణాలను సృష్టించబోతోంది అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే కర్టెన్ రైజర్ తర్వాత సంగీత దర్శకుడు కోటీ మాట్లాడుతూ.. ” ఇలాంటి సంగీతానికి సంబంధించిన కాంటెస్ట్ ను గతంలో నేను ఎప్పుడూ కూడా వినలేదు. ఎంతో క్రియేటివిటీతో కూడిన ఈవెంట్ కి వచ్చి మా సింగర్స్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న ఎయిరో వాటర్ బ్రాండ్, వరాహ గ్రూపు, ఫ్రీడమ్ ఆయిల్, యూనియన్ బ్యాంక్ ఇన్ అసోసియేషన్ విత్ స్పాన్స్ ట్రావెల్స్, వాకులా స్కిల్స్ సద్ది మూట తదితర స్పాన్సర్లందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి ఎంటర్టైన్మెంట్ కు వేదిక అవుతున్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో మే 17 ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు అంత్యాక్షరి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. హోస్టులుగా ప్రముఖ గాయకుడు రేవంత్, నిహారికలు చేయనున్నారు . ఐపీఎల్ తరహాలో రూపొందిన ఈ ప్రత్యేక పోటీలో ఆరు సెలెబ్రెటీ జట్లు పాల్గొంటాయి. ప్రతి జట్టుకు ప్రముఖ బ్రాండ్లు యజమానులుగా ఉండగా .. ఐకానిక్ సింగర్స్ న్యాయకత్వం వహిస్తారు. ఈ వేడుకను లైవ్ లో చూడాలి అంటే గచ్చిబౌలిలో చూడాలి అని ప్రముఖులు తెలిపారు.

తర రంపం అంత్యాక్షరి షోలో పోటీ పడబోతున్న 6 జట్లు ఇవే

Advertisement

*టీమ్ ప్రణవం:

ఓనర్: ప్రణవ గ్రూప్
లీడర్: ఎస్.పీ. శైలజ

Advertisement

1.PVNS రోహిత్
2.మాళవిక

*టీమ్ పేరు: చరణం

ఓనర్: మహా సిమెంట్స్
లీడర్: మల్లికార్జున్

1.గోపిక
2.శృతిక

*టీమ్ పేరు : మధురం

ఓనర్: బ్లూ యారో
లీడర్: గీతా మాధురి

1.దీపు
2.ఆదితి

*టీమ్ పేరు : వసంతం

ఓనర్: విజన్ VVK
లీడర్: కారుణ్య

1.సమీరా భరద్వాజ్
2.వాగ్దేవి

*టీమ్ : నాదం

ఓనర్: విశిష్ట గోల్డ్ & డైమండ్స్
లీడర్: కల్పన

1.శ్రీచరణ్
2.హారిణి

*టీమ్ పేరు: శ్రవణం

ఓనర్: లా కఫైన్
లీడర్: శ్రీకృష్ణ

1.దామిని బట్లా
2.అరుణ్ కౌండిన్య

తర రంపం సంగీతం, వినోదం, గ్లామర్, ప్రముఖులు మరియు బ్రాండ్లను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంగీత వినోద కార్యక్రమాలలో ఒకటిగా నిలవడానికి సిద్ధంగా ఉంది.

also read:విజయ్ రాజకీయ భవిష్యత్తుపై వేణుస్వామి జోస్యం..

టికెట్స్ వివరాలు:

టికెట్లు బుక్‌ మైషోలో అందుబాటులో ఉన్నాయి.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×