E-Paper
Advertisement

Sudha Kongara: వారి వల్లే ఈ పరిస్థితి.. విజయ్ ఫ్యాన్స్ పై సుధా కొంగర షాకింగ్ కామెంట్స్!

Sudha Kongara: వారి వల్లే ఈ పరిస్థితి.. విజయ్ ఫ్యాన్స్ పై సుధా కొంగర షాకింగ్ కామెంట్స్!
Advertisement

Sudha Kongara: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళాదర్శకురాలిగా కొనసాగుతున్న వారిలో సుధా కొంగర ఒకరు. ఈమె దర్శకత్వంలో ఇప్పటివరకు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి ఇకపోతే తాజాగా శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా నటించిన పరాశక్తి (Parasakthi)సినిమా కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ ఉద్యమ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అవంతరాలను దాటుకొని సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో కాకుండా మిశ్రమ స్పందన లభించింది.

పరాశక్తిపై తప్పుడు ప్రచారం..

ఇక ఈ సినిమాకు పోటీగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్(Vijay) దళపతి సినిమా జననాయగన్ (Jananayagan)సినిమా కూడా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని పలువురు భావించారు అయితే ఉన్నఫలంగా విజయ్ సినిమా వాయిదా పడటంతో పరాశక్తి సినిమాకు కలిసొచ్చిన అంశమే అయినప్పటికీ కొంతమంది విజయ్ అభిమానులు ఈ సినిమాని టార్గెట్ చేశారు అంటూ సుధా కొంగర తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా సుధా కొంగర మాట్లాడుతూ తమ సినిమాపై ఉద్దేశపూర్వకంగానే ఒక హీరో అభిమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడారు.

వాళ్ల తప్పు వల్లే సినిమా ఆగిపోయింది..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో సుధాకర్ కొంగర హీరో విజయ్ పేరును ఎక్కడ ప్రస్తావించకపోయిన,సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన హీరో సినిమా అంటూ సుధా కొంగర మాట్లాడటంతో ఈమె విజయ్ గురించే మాట్లాడారని స్పష్టమవుతుంది. కచ్చితంగా ఆమె హీరో విజయ్ అభిమానులను ఉద్దేశించే మాట్లాడారని తెలుస్తోంది. . ప్రస్తుతం మేము ఆ హీరో అభిమానుల రౌడీయిజంతో పోరాటం చేస్తున్నామని తెలిపారు. అభిమానులు చేసిన తప్పుల వల్లే వారి హీరో సినిమా ఆగిపోయింది.

రౌడీయిజంతో పోరాటం..

Advertisement

ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం కారణంగా తమ సినిమా ఇబ్బందుల్లో పడుతుందని సుధా తెలియజేశారు. ఈ రౌడీయిజానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని సుధా కొంగర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటంతో విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధా కొంగర ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి మాటలు మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సుధా కొంగర వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ అనే విధంగా వివాదం నడుస్తుంది. హీరో విజయ్ అభిమానులను రౌడీలతో పోల్చి సుధా మాట్లాడటంతో ఇది చాలా దారుణమని ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Also Read: Toxic Film: యశ్ టాక్సిక్ టీజర్ వివాదం.. ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసిన నటి!

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×