Sudigali Sudheer GOAT : సుడిగాలి సుధీర్.. పెద్ద హీరో ఏం కాదు. కానీ, కామెడీ షోల వల్ల పెద్ద ఇమేజే వచ్చింది ఆయనకు. దీంతో వరుస సినిమాలు చేస్తున్నాడు. కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో పక్కన పెడితే, ఇప్పుడు కూడా ఆయనకు హీరోగా ఛాన్స్‌లు వస్తున్నాయి. ఇప్పుడు సుదీర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి గోట్ (GOAT). మరొకటి హైలేస్సా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో గోట్ (GOAT) మూవీ కాస్త వివాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌కి హీరో రావడం లేదంట. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ (GOAT) అని 2023లో స్టార్ట్ చేశారు. జైష్ణవ్ ప్రొడక్షన్, మహా రాజా క్రియేషన్స్‌లో మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ నరేష్ కుప్పిలి దీనికి డైరెక్టర్. 3 కోట్ల నుంచి 5 కోట్ల బడ్జెట్ అంచనాతో స్టార్ట్ చేశాడు డైరెక్టర్. కానీ, అది చాలా ఎక్కువ పెరిగిపోవడంతో… ఆ నరేష్ కుప్పిలి మధ్యలోనే సినిమాను వదిలి వెళ్లిపోయాడు అనే టాక్ ఉంది.
తర్వాత ఎన్నో సమస్యలతో ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి అంటే.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. కానీ, ప్రమోషన్స్‌కు హీరో సుధీర్ రావడానికి ఇష్టపడటం లేదంట. అందుకే… ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయలేదని తెలుస్తుంది.
అయితే, గోట్ (GOAT) మూవీ ప్రమోషన్స్‌కు హీరో సుధీర్ రాకపోవడం వెనక ఈ సినిమా పాత డైరెక్టర్ నరేష్ కుప్పిలి ఉన్నాడు అనే మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాను సినిమా నుంచి మధ్యలోనే వెళ్లిపోవడంతో.. డైరెక్టర్ నరేష్ కుప్పిలి – నిర్మాత చంద్ర శేఖర్ మధ్య వివాదాలు ఉన్నాయని, అందువల్ల సుదీర్‌ను ప్రమోషన్స్‌కి నరేష్ అడ్డుకుంటున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
ఏది ఏమైనా.. సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరో బాధ్యతలు తీసుకోవాలి. అలా కాకుండా.. ఇలా మధ్యలో వదిలివెళ్లడం సరికాదు అని అంటున్నారు.
ప్రమోషన్స్‌కు రాకపోవడంతో హీరోపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా అసోసియోషన్‌లో నిర్మాత చంద్ర శేఖర్ ఫిర్యాదు కూడా చేశారంట. కానీ, ఇప్పటి వరకు స్పందన లేదు అని తెలుస్తుంది. దీంతో తన సినిమాకు తనకు దిక్కు ఎవరు అంటూ నిర్మాత తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.
నిజానికి సుడిగాలి సుధీర్‌కు మంచి ఫాలోయింగే ఉంది. కానీ, బాక్సాఫీస్ మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే 3 కోట్ల వరకు కూడా లేదు. కానీ, సుధీర్‌పై ఏకంగా 12 నుంచి 14 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాడు నిర్మాత చంద్రశేఖర్. ఇప్పుడు ఇవి రిటర్న్ రావాలంటే.. నిర్మాతకు సుదీర్ అండగా ఉండాల్సిన అవసరం ఉంది.