E-Paper
Advertisement

Intercourse: పాపం, పాతికేళ్లు నిండినా ‘బోణి’ కొట్టని మగాళ్లు.. కారణాలు ఇవేనట, వామ్మో!

Intercourse: పాపం, పాతికేళ్లు నిండినా ‘బోణి’ కొట్టని మగాళ్లు.. కారణాలు ఇవేనట, వామ్మో!
Advertisement

ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్లిపోతోంది. చిన్న వయసులోనే చాలా మంది పెద్ద విషయాలను తెలుసుకుంటున్నారు. కానీ, తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో యువకుల శృంగార అనుభవం గురించి ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాయిలతో పోల్చితే, అమ్మాయిలే ముందుగా ఆ అనుభవాన్ని పొందుతున్నట్లు తేలింది. ఇంకా చెప్పాలంటే, 25 ఏళ్లు వచ్చినా, ఒక్కసారి కూడా శృంగార అనుభవం లేని యువకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు తేలింది.

ఏ దేశాల్లో ఏంటి పరిస్థితి?

అమెరికాలో 25–34 ఏళ్ల వయస్సు గల ఆరుగురు వ్యక్తులలో ఒకరు తాము శృంగారంలో పాల్గొనలేదని చెప్పారు. 25–30 ఏళ్ల వయస్సున్న యువకులు దాదాపు 10–15% మంది ఇప్పటికీ ఆ అనుభవం పొందలేదన్నారు. జపాన్, దక్షిణ కొరియా, UK సహా ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే, ఈ ధోరణి వెనుక అసలు కారణాలను వెతికే ప్రయత్నించారు పరిశోధకులు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ అనుభవాన్ని ఎందుకు పొందడం లేదంటే? 

Advertisement

25 ఏళ్లు దాటినా యువకులు ఆ అనుభవానికి దూరం కావడం వెనుక అసలు సమస్యలు వేరే ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. సమాజంలో మార్పు కారణంగానే ఇలా జరుగుతుందని తేల్చారు.

⦿ సామాజిక ఆందోళన, సిగ్గు

చాలా మంది యువకులు కొత్త వ్యక్తులతో, ముఖ్యంగా ఆడవారితో మాట్లాడటానికి భయపడతారు. మరికొంత మంది  చిన్నతనంలోనే పలు కారణాలతో మహిళలంటే భయానికి గురవుతారు. ఇంకొంత మంది ఆటిజం స్పెక్ట్రంలో ఉన్నారు. వీళ్లు బయటకు వెళ్లడం, అమ్మాయిలతో స్నేహం చేయడం, డేట్ కు వెళ్దామని అడగడం చాలా కష్టంగా భావిస్తారు.

⦿ అమ్మాయిలతో తక్కువ సమయం గడపడం  

Advertisement

ఈ రోజుల్లో యువకులు అమ్మాయిలను వ్యక్తిగతంగా తక్కువ సమయం కలుస్తున్నారు. అదీ, ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటనే. పార్టీలు, గ్రూప్ హ్యాంగ్ అవుట్‌లు తక్కువగా ఉన్నాయి. ఎడ్యుకేషన్, వర్క్, హాబీస్ ఆన్‌ లైన్‌ లోకి మారాయి. యాప్‌ లలో చాలా మంది యువకులకు తగిన మ్యాచ్‌లు దొరుకుతాయి. మిగతా వారికి దొరకడం లేదు.

⦿ డబ్బు,  జీవిత సమస్యలు

ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం చాలా ఖరీదైనదిగా మారింది. ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోయాయి.  చాలా మంది యువకులు ఇప్పటికీ తమ తల్లిదండ్రులతో నివసిస్తున్నారు. డబ్బు సంపాదించాలని ఆందోళనలో, డేటింగ్ అంత ముఖ్యమైదిగా అనిపించడం లేదు.

⦿ ఆన్‌లైన్‌లో ఎక్కువ గడపడం

ఫోన్‌లు, వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా,  పోర్న్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని చాలా సురక్షితమైనవిగా భావిస్తున్నారు. వాటి ద్వారా త్వరగా ఆనందాన్ని పొందుతున్నారు. నిజ జీవితంలో యువతులతో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించడం లేదు.

⦿ తక్కువ మంది ఫ్రెండ్స్

ఈ రోజుల్లో చాలా మంది పురుషులకు తక్కువ మంది సన్నిహితులు ఉంటున్నారు. శృంగారం గురించి మాత్రమే కాదు, చాలా విషయాల్లో ఇదే చెప్తున్నారు. “నాకు బెస్ట్ ఫ్రెండ్ లేడు. చాలా రోజులు నేను ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నాను. ఫ్రెండ్షిప్ లో డేటింగ్ సమస్యలు వస్తాయి” అంటున్నారు.

సంతోషించాల్సిన విషయం ఏంటంటే?

నిజానికి గతంలో 20 ఏళ్లలోపు యువకులు తమ తొలి అనుభవాన్నిపొందినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ, ఇప్పుడు 25- 30 ఏళ్లు వచ్చినా, శృంగారానికి దూరంగా ఉన్నట్లు తేలింది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏటంటే.. ఆ అనుభవానికి దూరంగా ఉన్న యువకులు మరింత ఆత్మవిశ్వాసంతో జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సామాజిక నైపుణ్యాన్ని పొందుతున్నారు. ఆ తర్వాత మంచి జీవితాన్ని గడుపుతున్నారు.

Read Also: అక్కడ నీళ్లు పైకి ప్రవహిస్తాయి.. చూస్తే మెంటలెక్కడం పక్కా!

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×