Sudheer Journey: సుడిగాలి సుధీర్..ఇప్పుడంటే పరిచయం అక్కర్లేని పేరు.కాని విజయవాడలోని ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అష్ట కష్టాలు అనుభవించాడని మీకు తెలుసా..అవును ఇప్పుడంటే బుల్లి తెరపై కనిపించగానే నవ్వుల వర్షం కురుస్తుంది.కానీ ఈ కుర్రాడే ఒకప్పుడు పొట్ట నింపుకోవడానికి నల్లా నీళ్ళు తాగాడు.మరి అలా సున్నా నుండి స్టార్ గా ఎదిగిన ఈ సుదీర్ ఆలియాస్ సుడి గాలి సుధీర్ లైఫ్ జర్నీ ఏంటో ఒకసారి చూసేద్దాం.
1987 మే19న పుట్టిన సుధీర్ పూర్తీ పేరు సుధీర్ ఆనంద్ బయానా.విజయవాడలోని ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుదీర్ చిన్నప్పటి నుండి కష్టాలని ఈదుకొచ్చాడు. తన తండ్రి యాక్సిడెంట్‌తో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడినప్పుడు ఎంతో ఆర్ధిక ఇబ్బందులకి లోనయ్యాడు. ఇక ఇంటి బాధ్యతలు నెరవేర్చాల్సిన పెద్ద కొడుకుగా కేవలం 20 ఏళ్ల వయసులో హైదరాబాద్ రైలెక్కాడు.
అలా పొట్టకూటి కోసం చిన్నా చితకా పనులు చేశాడు సుదీర్ .ఒకానొక సమయంలో తిండికి కూడా డబ్బుల్లేక నల్లా నీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులను కూడా చూశాడు సుధీర్ .చివరికి రామోజీ ఫిల్మ్ సిటీలో రోజుకు మూడు షోలు చేసే మ్యాజిషియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఎక్కడైతే అవమానాలు ఎదురయ్యాయో, అక్కడే తన జెండా పాతాలనే కసితో అడుగులు వేశాడు .
అలాంటి టైమ్‌లో మ్యాజిక్ మంత్ర వంటి షోల ద్వారా బుల్లితెరకు పరిచయమైనా, సుధీర్ లైఫ్‌ను మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘జబర్దస్త్’ పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. వేణు వండర్స్ టీమ్‌లో ఒక సాధారణ ఆర్టిస్ట్‌గా జబర్దస్త్ స్టేజ్ పై అడుగుపెట్టిన సుదీర్ తనలోని కామెడీ టైమింగ్, అమాయకత్వం, మల్టీ టాలెంట్‌తో జడ్జీలు నాగబాబు, రోజాలను మెప్పించి అతి తక్కువ కాలంలోనే ‘సుడిగాలి సుధీర్’గా తనకంటూ ఒక టీమ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇక గెటప్ శ్రీను అద్భుతమైన గెటప్‌లు, ఆటో రాంప్రసాద్ పంచ్‌లు, సుధీర్ సెల్ఫ్ సెటైర్స్ తో కూడిన వీరి టీమ్ అప్పట్లో వచ్చిందంటే చాలు ఆడియన్స్ పొట్ట చేతులో పట్టుకొని నవ్వే వారంటే ఆశ్చర్యం లేదు.ఇక ఆ జబర్దస్త్ షో ఊహించని రేటింగ్స్ తో హిస్టరీ స్ప్రుష్టించడమే కాకుండా యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ తెలుగు కామెడీ సత్తా ఏంటో చూపించింది.
ఇక పార్టిసిపెంట్ గా మొదలైన సుధీర్ ప్రస్థానం కేవలం కామెడీ స్కిట్స్‌తోనే ఆగిపోలేదండోయ్. ‘ఢీ అల్టిమేట్ డాన్స్ షో’లో టీమ్ లీడర్‌గా ఎంటర్ అయి, అక్కడ రష్మీ గౌతమ్‌తో కెమిస్ట్రీ, ప్రదీప్ మరియు హైపర్ ఆదితో కలిసి చేసిన అల్లరి ఈవెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళింది.
అలా కేవలం నవ్వులలో ముంచెత్తడమే కాదు.. తన టీమ్‌ను నడిపిస్తూ 9, 10 సీజన్లలో ఏకంగా టైటిల్స్ గెలిచి బెస్ట్ మెంటార్‌గా ప్రూవ్ చేసుకున్నాడు కూడా.ఇక ‘పోవే పోరా’ వంటి యూత్ గేమ్ షోలో విష్ణుప్రియతో కలిసి హోస్ట్‌గా మారి, కాలేజ్ స్టూడెంట్స్ తో చేసిన షో ఎంత రచ్చ చేసిందో చెప్పక్కర్లేదు.అలా ఏకంగా ఈ షో వందకు పైగా ఎపిసోడ్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడం విశేషం.ఇక ఈ షో వల్లే 2018 సంవత్సరానికి గాను హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆన్ టీవీ జాబితాలో టాప్ 13వ స్థానంలో నిలిచాడు కూడా.
ముఖ్యంగా చిన్న తనంలో తను నేర్చుకున్న భరతనాట్యం, వెస్ట్రన్ డాన్స్ అన్నీ బుల్లి తెరపై ప్రదర్శిస్తూ ఆల్‌రౌండర్‌గా చాల మందికి దక్కని క్రేజ్ ని దక్కించుకున్నాదు సుదీర్.ఇక కేవలం షో లే కాదండోయ్ సినిమాల్లోనూ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు సుదీర్.అలా మొదటి సారిగా “వేర్ ఈజ్ విద్యా బాలన్”(2015)లో కనిపించిన సుధీర్ 2017లో “నేనోరకం”లోనూ కనిపించి అలరించాడు .ఇక 2019లో వచ్చిన “సాఫ్ట్‌వేర్ సుధీర్” సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 2020లోవచ్చిన “3 మంకీస్”లో కనిపించిన సుధీర్ “వాంటెడ్ పండుగాడ్”, “గాలోడు”సినిమాలతో మంచి పేరే తెచ్చుకున్నాడు.ముఖ్యంగా “కాలింగ్ సహస్ర” సినిమాతో సుధీర్ నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి.ఏది ఏమైనా సున్నా నుండి మొదలైన సుదీర్ ప్రయాణం నేడు ఒక స్టార్ గా ఎదగడంలో అతడి నిర్విరామ కృషి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు !