E-Paper
Advertisement

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!
Advertisement

Supreme Court: తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో స్పెషల్ ఇంటెన్సీవ్​ రివిజన్ (SIR)​ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ దీనికి సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఎస్​ఐఆర్ ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్​ కు కేవలం ఓటర్ల జాబితాపై మాత్రమే అధికారం ఉంటుందని పేర్కొంది. ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రం పౌరసత్వం పోదని స్పష్టం చేసింది.

వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎస్​ఐఆర్​ ప్రక్రియపై ప్రసేన్‌జిత్ బోస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన ప్రజా పంపిణీ వ్యవస్థ, అన్నపూర్ణ పథకం, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు అందించే ఇతర సంక్షేమ పథకాల నుంచి వారిని మినహాయించకూడదని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

Advertisement

బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ అంశంపై స్పష్టతనిచ్చిందని ధర్మాసనం గుర్తుచేసింది. తమకు ఈ విషయంపై అవగాహన ఉందని.. బీహర్ ఎస్ఐఆర్ తీర్పులో ఓటింగ్ హక్కులపై ఈసీఐ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది పౌరసత్వాన్ని నిర్దారించలేదని స్పష్టం చేశామంది. పౌరసత్వ చట్టం కింద ఈ విషయాన్ని తుది పరిష్కారం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించాల్సిన బాధ్యత మాత్రమే ఈసీఐకి ఉందని పేర్కొంది.

Also Read: రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

Advertisement

చట్టపరంగా పరిస్థితి ఇలా ఉన్నా బాధితులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది శంకర నారాయణన్ వాదించారు. ఈ సంక్షేమ పథకాల నుంచి వారిని తొలగిస్తారని ఊహించలేదని చెప్పారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 25వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: ఫ్రీ వైఫై వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లు ఒకటే పెట్టారా? అయితే మీ సేవింగ్స్ గోవిందా!

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×