E-Paper
Advertisement

Hey Bhagawan Teaser: ‘హే భగవాన్’ టీజర్.. ఫుల్ ఫన్ రైడ్, సుహాస్ కొత్త ప్రయత్నం

Hey Bhagawan Teaser: ‘హే భగవాన్’ టీజర్.. ఫుల్ ఫన్ రైడ్, సుహాస్ కొత్త ప్రయత్నం
Advertisement

Hey Bhagawan Teaser:ప్రముఖ హీరో సుహాస్..’పడి పడి లేచే మనసు’ అనే సినిమా ద్వారా నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా తొలి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. అంతేకాదు ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఒకవైపు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుహాస్.. మరోవైపు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు హిట్ 2 లాంటి చిత్రాలలో మెయిన్ పాత్రలు పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. అలాంటి సుహాస్ ఇప్పుడు తాజాగా నవ్వులు పూయించడానికి సిద్ధం అయ్యారు. హే భగవాన్ (Hey bhagawan)అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

హే భగవాన్ అంటున్న సుహాస్..

సుహాస్ (Suhas) హీరోగా ‘లిటిల్ హార్ట్స్’ బ్యూటీ శివాని నాగారం (Shivani Nagaram) హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘హే భగవాన్’ చిత్రానికి గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రైటర్ పద్మభూషణ్’ షణ్ముఖ ప్రశాంత్ కథను అందించగా.. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, వీకే నరేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ తో పాటు వినోదం పంచనుంది. 20 ఫిబ్రవరి 2026న విడుదల చేయడానికి మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా నుండి టీజర్ విడుదల చేశారు.

నవ్వులు పూయిస్తున్న హే భగవాన్ టీజర్..

Advertisement

ఒక రహస్యమైన ఫ్యామిలీ బిజినెస్ చుట్టూ ఈ కథ సాగుతోంది. ముఖ్యంగా ఈ కథలో ఆ వ్యాపారం ఏంటో ఎవరికీ చెప్పకూడదనే ఆసక్తికర నిబంధనతో సాగే తండ్రి కొడుకుల ప్రయాణం చాలా కామెడీగా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సుహాస్ స్కూల్లో చదువుతున్నప్పుడే పెద్దయ్యాక ఏమవుతావని టీచర్ అడిగితే.. మా నాన్న చేసే బిజినెస్ను టేక్ ఓవర్ చేసుకుంటాను అని అప్పట్లోనే తన నిర్ణయంగా చెబుతాడు. సుహాస్ పెద్దయ్యాక కూడా తన తండ్రి చేసే బిజినెస్ ను టేక్ ఓవర్ చేసుకోవాలనే ఆలోచనతోనే కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్ ఏంటి అనేది అతడికి కూడా తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇక సుహాస్ తన తండ్రి చేసే బిజినెస్ గురించి తెలుసుకున్నాడా? ఆఖరికి తన తండ్రి బిజినెస్ ను టేక్ ఓవర్ చేసుకున్నారా? అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

ముఖ్యంగా హీరోయిన్ శివాని నాగారం , సుహాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు నరేష్ – సుహాస్ మధ్య సాగే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ తర్వాత సుహాస్ – శివానీ నాగారం మరోసారి జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. టీజర్ తోనే అంచనాలు పెంచుతున్న ఈ సినిమాలో ఫుల్ ఫన్ రైడ్ కనిపిస్తోంది పైగా కొత్త ప్రయోగం చేస్తున్న సుహాస్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Advertisement

 

ALSO READ:Varun Dhawan: మెట్రో ట్రైన్ లో హీరో విన్యాసాలు.. ఫైన్ విధించిన అధికారులు.. మరొకరికి వార్నింగ్ అంటూ!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×