E-Paper
Advertisement

Varun Dhawan: మెట్రో ట్రైన్ లో హీరో విన్యాసాలు.. ఫైన్ విధించిన అధికారులు.. మరొకరికి వార్నింగ్ అంటూ!

Varun Dhawan: మెట్రో ట్రైన్ లో హీరో విన్యాసాలు.. ఫైన్ విధించిన అధికారులు.. మరొకరికి వార్నింగ్ అంటూ!
Advertisement

Varun Dhawan:సినిమా తెరపై హీరోలు చేసే సాహసాలు చూడటానికి భలే మజాగా ఉంటాయి. కానీ, అదే హీరోలు నిజ జీవితంలో, అది కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో విన్యాసాలు చేస్తే ఎలా ఉంటుంది? బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan) తాజాగా సరిగ్గా ఇలాంటి పనే చేసి చిక్కుల్లో పడ్డారు. మెట్రో రైలును జిమ్‌గా మార్చేసి ఆయన చేసిన ఫీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. రూల్స్ ఎవరికైనా ఒకటేనని నిరూపిస్తూ అధికారులు తీసుకున్న చర్య అందరినీ ఆశ్చర్యపరిచింది.

రీల్ లైఫ్ హీరో.. రియల్ లైఫ్ లో జరిమానా..

ముంబై మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో వరుణ్ ధావన్ సరదాగా మెట్రో కోచ్‌లోని హ్యాండిల్ రాడ్లను పట్టుకుని పుల్-అప్స్ తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ముంబై మెట్రో ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ సీరియస్‌గా స్పందించింది. ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన పరికరాలను విన్యాసాలకు వాడటం క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వరుణ్ ధావన్ కు రూ. 500 జరిమానా విధించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతం కాకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సెలబ్రిటీ హోదాలో ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి, ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయడంపై నెటిజన్లు కూడా పెదవి విరుస్తున్నారు.

నిబంధనలు అందరికీ సమానమే.. అధికారుల స్పష్టీకరణ:

Advertisement

ఈ ఉదంతంపై మెట్రో అధికారులు స్పందిస్తూ.. మెట్రో అనేది సామాన్య ప్రజల ప్రయాణ సాధనమని, దాని ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. కేవలం వరుణ్ ధావన్ మాత్రమే కాదు, ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తికి కూడా అధికారులు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసే విధంగా లేదా ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఈ ఘటన ద్వారా సామాన్యులైనా, సెలబ్రిటీలైనా సరే ప్రజా రవాణా వ్యవస్థలో నిబంధనలు అతిక్రమిస్తే శిక్ష తప్పదని అధికారులు ఒక బలమైన సందేశాన్ని పంపారు.

ALSO READ:Jr.NTR: జూ.ఎన్టీఆర్ కి అస్వస్థత.. ప్రశాంత్ నీల్ మూవీకి ఆలస్యం తప్పదా?

బాధ్యతాయుత ప్రవర్తన అవసరం:

Advertisement

స్టార్ హోదా ఉన్న వ్యక్తులను లక్షలాది మంది యువత ఫాలో అవుతుంటారు. ఇలా ఫైన్ విధించటం వల్ల మరొకరు ఇలాంటి సాహసం చేయరు. సెలబ్రెటీ గా వాళ్ళు చేసే ప్రతి చిన్న పని సమాజంపై ప్రభావం చూపుతుంది. వరుణ్ ధావన్ చేసిన ఈ పొరపాటు ఆయనకు జరిమానాతో పాటు విమర్శలను కూడా తెచ్చిపెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో విన్యాసాలు చేయడం కంటే, భద్రతా నియమాలను పాటించి అందరికీ ఆదర్శంగా నిలవడమే నిజమైన హీరో లక్షణం. ఇప్పటికైనా సెలబ్రిటీలు ఇటువంటి పబ్లిసిటీ స్టంట్స్ చేసేటప్పుడు నియమ నిబంధనలను గుర్తుంచుకుంటే మంచిది.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×