Allu Arjun: టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా.. ఇంకొక సినిమా తర్వాత మరొక సినిమా అంటూ వరుసగా రీరిలీజ్ లు చేస్తూ మేకర్స్ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇక ఈ మధ్యనే శివ రిరిలీజ్ తర్వాత మరికొన్ని సినిమాలు రీరిలీజ్ ల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక ఇంకో పక్క బాహుబలి ది ఎపిక్ తర్వాత రెండు పార్ట్స్ గా వచ్చిన సినిమాలను బాహుబలిది ఎపిక్ లాగా ఒకే సినిమాగా రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
తమ అభిమాన హీరో కెరీర్ లో రెండు భాగాలుగా చేసిన సినిమాల లిస్టు తీసి తమకు ఆ సినిమాలు రెండు కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయమని మేకర్స్ ను సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. అలా బాహుబలి ది ఎపిక్ తరువాత పుష్ప ఫ్రాంచైజీని కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేయాలని అల్లు అర్జున్, సుకుమార్ ను అభిమానులు అడుగుతున్నారు. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్.. రెండు సినిమాలు రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే ఇప్పుడు ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
అందులో భాగంగానే సుకుమార్ ను, అల్లు అర్జున్ ను ఈ విషయమై ఆలోచించాల్సిందిగా ఫాన్స్ సోషల్ మీడియాలో కోరుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ విషయాన్ని సుకుమార్, అల్లు అర్జున్ వద్దకు మేకర్స్ చేర్చారని, కానీ వారిద్దరూ ఆ ప్రపోజల్ కి నో చెప్పినట్లు తెలుస్తుంది. అందుకు కారణం వారిద్దరూ సినిమాలతో బిజీగా ఉండడమే అని సమాచారం. అంతేకాకుండా రెండవ భాగం గత సంవత్సరం డిసెంబర్ నే విడుదలైనందున ఈ ప్రతిపాదనపై బన్నీ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.
బాహుబలి ఫ్రాంచైజీ దశాబ్దం క్రితం రిలీజ్ అవడంతో అప్పటి పరిస్థితులను బట్టి కొందరు థియేటర్లో ఆ సినిమాను చూడడం మిస్సయ్యారు. అందుకే ఆ సినిమాకు ఫ్యాన్స్ థియేటర్ కు క్యూ కట్టారు. అయితే ఇప్పుడు పుష్ప ఆల్రెడీ రెండు భాగాలను ఫాన్స్ థియేటర్లోనే చూడడం జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ రెండు భాగాలను సింగిల్ గా చేసి రిలీజ్ చేస్తే అంత ఆసక్తి చూపించరేమోనన్నా అనుమానం కూడా ఉండడంతో సుకుమార్ సైతం ఈ ప్రతిపాదనను వద్దని చెప్పినట్లు తెలుస్తుంది.
ఇక దీంతోపాటు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే ఆ సినిమా నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఇంకోపక్క సుకుమార్ సైతం తన రాబోయే ప్రాజెక్ట్ తో బిజీగా మారాడు. ఆయన కూడా సమయం లేకుండానే గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో పుష్ప ఫ్రాంచైజీని ఒకే సినిమాగా రూపొందించడంపై దృష్టి పెట్టేంత సమయం ఇద్దరికీ లేకపోవడంతో వారు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కాకపోయినా ముందు ముందు పుష్ప ఫ్రాంచైజీని ఒకే సినిమాగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.