E-Paper
Advertisement

Dry Shampoo: డ్రై షాంపూ వాడటం ప్రమాదకరమా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

Dry Shampoo: డ్రై షాంపూ వాడటం ప్రమాదకరమా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ?

Dry Shampoo: రోజువారీ జీవితంలో సమయం లేని వారికి, లేదా ప్రయాణాలు చేసే వారికి డ్రై షాంపూ ఒక తక్షణ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇది నీరు లేకుండా జుట్టును శుభ్రం చేసినట్లుగా కనిపించేలా చేస్తుంది. అయితే.. దీనిని అతిగా వాడటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీనిని వాడాలంటే  మాత్రం  లాభాలు, నష్టాలు గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

డ్రై షాంపూతో లాభాలు:

సమయాన్ని ఆదా చేస్తుంది: అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. జుట్టు శుభ్రం చేసుకునే సమయం లేనప్పుడు, డ్రై షాంపూను ఉపయోగించి వెంట్రుకలను తక్షణమే తాజాగా కనిపించేలా చేయవచ్చు.

ఆయిల్/జిడ్డును తగ్గిస్తుంది: ఇందులో ఉండే పౌడర్ లేదా స్టార్చ్ జుట్టులోని అదనపు జిడ్డును, చెమటను పీల్చుకుని, జుట్టును శుభ్రంగా, తేలికగా ఉండేలా చేస్తుంది.

వాల్యూమ్ పెంచుతుంది : జిడ్డు పీల్చుకోవడం వల్ల జుట్టుకు పట్టు ఇచ్చి, అది మరింత ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.

రంగు ఎక్కువ కాలం ఉంటుంది: తరచుగా షాంపూతో తల స్నానం చేయడం వల్లహెయిర్ కలర్ త్వరగా వెళ్ళిపోతుంది. డ్రై షాంపూ వాడటం వల్ల తల స్నానం చేయాల్సిన అవసరం తగ్గుతుంది. దీనితో జుట్టు రంగు ఎక్కువ రోజులు ఉంటుంది.

డ్రై షాంపూ: నష్టాలు/ప్రమాదాలు :

డ్రై షాంపూ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. దీనిని అధికంగా వాడితే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

జుట్టు కుదుళ్లు మూసుకుపోవడం : డ్రై షాంపూ కేవలం జిడ్డును పీల్చుకుంటుంది కానీ మురికిని శుభ్రం చేయదు. తరచుగా వాడటం వల్ల నూనె, మురికి, చర్మ కణాలు కలిసి కుదుళ్లలో పేరుకుపోతాయి. ఇది చుండ్రు, దురద, లేదా తామర వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.

జుట్టు రాలడం, చిట్లిపోవడం : కుదుళ్లు మూసుకుపోవడం వల్ల జుట్టు పెరుగుదల దెబ్బతింటుంది. కొన్నిసార్లు జుట్టు రాలడం కూడా పెరుగుతుంది. అలాగే.. డ్రై షాంపూలలో ఉండే ఆల్కహాల్ జుట్టును పొడిగా మార్చి, అది సులభంగా చిట్లిపోయేలా చేస్తుంది.

పొడిబారిన స్కాల్ప్: డ్రై షాంపూ సహజ నూనెలనుకూడా పీల్చుకుంటుంది. ఈ నూనెలు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని అతిగా తొలగించడం వల్ల స్కాల్ప్ పొడిగా.. పొలుసులుగా మారుతుంది.

క్యాన్సర్ కారకాలు : కొన్ని రకాల ఏరోసోల్ డ్రై షాంపూలలో బెంజీన్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గతంలో నివేదికలు వచ్చాయి. బెంజీన్ అనేది క్యాన్సర్ కారక పదార్థం. కాబట్టి.. నాణ్యత గల ఉత్పత్తులను ఎంచుకోవాలి.

సురక్షితంగా ఎలా వాడాలి ?

అప్పుడప్పుడు మాత్రమే వాడండి: తరచుగా వాడకానికి బదులుగా.. అత్యవసర పరిస్థితుల్లో లేదా వరుసగా 1-2 రోజులు మాత్రమే వాడండి. హోం మేడ్ షాంపూతో తల స్నానం చేయడం తప్పనిసరి.

పరిమితంగా ఉపయోగించండి: కేవలం జిడ్డు ఉన్న జుట్టు కుదుళ్లపై మాత్రమే కొద్ది మొత్తంలో స్ప్రే చేయండి. ఎక్కువ వాడకండి.

Also Read: గుండె ఆరోగ్యానికి నెయ్యి మంచిదా? కాదా? అసలు నిజం వెంటే షాక్ అవుతారు !

రాత్రి పూట వాడండి: రాత్రి పడుకునే ముందు వాడితే.. అది రాత్రంతా జిడ్డును పీల్చుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది.

సరైన బ్రాండ్‌ను ఎంచుకోండి: బ్రాండ్ .. ప్రమాదకర రసాయనాలు లేని మంచి నాణ్యత గల డ్రై షాంపూను ఎంచుకోండి.

డ్రై షాంపూ అనేది తల స్నానానికి బదులు కాదు , ఇది కేవలం ఒక తాత్కాలిక పరిష్కారం. దీనిని పరిమితికి మించి వాడకుండా.. సరైన పద్ధతిలో ఉపయోగిస్తే.. ఇది సురక్షితమే. దీనిని అతిగా వాడటం వల్ల జుట్టు, స్కాల్ప్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×